బిజినెస్

మందగించిన కీలక రంగాల వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 1: కీలకమైన ఎనిమిది రంగాల పనితీరు మార్చి నెలలో మందగించడంతో, వీటి ప్రగతి మూడు నెలల కనిష్టమైన 4.1 శాతానికి తగ్గిపోయింది. బొగ్గు, ముడి చమురు, సహజవాయు రంగాలతో సహా మొత్తం ఆరు రంగాల పనితీరు తగిన రీతిలో లేకపోవడమే ఈవిధంగా వృద్ధి పడిపోవడానికి ప్రధాన కారణం.
రిఫైనరీ ఉత్పత్తులు, ఉక్కు, విద్యుత్ రంగాల్లో కూడా వృద్ధి రేటు వేగం పడిపోయింది. 2017 మార్చిలో 5.2 శాతం వృద్ధిని నమోదు చేసిన రసాయన ఎరువులు, సిమెంట్ రంగాలు ఈ ఏడాది ఆశాజనకమైన పనితీరు ప్రదర్శించలేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ విడుదల చేసిన సమాచారం వెల్లడించింది. ఈ కీలక రంగాలు 2017, డిసెంబర్‌లో 3.8 శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేయడం గమనార్హం. మొత్తం ఎనిమిది రంగాల సగటు ప్రగతి 2017-18 సంవత్సరంలో 4.2 శాతంగా నమోదైంది. ఇది గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో నమోదైన కనిష్ట ప్రగతి ఇదే. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 4.8 శాతం నమోదు కాగా, 2015-16లో 3 శాతం నమోదైంది. ఈ ఎనిమిది కీలక రంగాలు మొత్తం ఫ్యాక్టరీ ఉత్పత్తుల్లో 41 శాతం ఆక్రమిస్తున్నందువల్ల, పారిశ్రామిక ప్రగతి సూచిపై ప్రభావాన్ని చూపే అవకాశముంది. ఉత్పత్తి విషయంలో రసాయన ఎరువులు, సిమెంట్ రంగాలు మాత్రమే మంచి ప్రగతిని నమోదు చేశాయి. మార్చి నెలలో ఈ రెండు రంగాలు వరుసగా 3 శాతం, 13 శాతం వృద్ధి నమోదు చేశాయి. కాగా బొగ్గు, రిఫైనరీ , స్టీలు ఉత్పత్తుల వేగం వరుసగా 9.1 శాతం ( 2017, మార్చిలో వీటి ఉత్పత్తులు 10.6 శాతం నమోదయ్యాయి), 1.3శాతం, 1 శాతం, 4.7 శాతం (గత ఏడాది 11శాతం) నమోదైంది. 2017 మార్చిలో 6.2 శాతంగా ఉన్న విద్యుత్ రంగ వృద్ధి రేటు, ఈ ఏడాది 4.5 శాతానికి పడిపోయింది. ఇక ముడిచమురు మార్చినెలలో రికార్డు స్థాయి దిగువకు అంటే 1.6 శాతం నమోదు చేసింది.