బిజినెస్

ప్రైవేటీకరించే సమస్యే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూ ఢిల్లీ, మే 1: ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తి లేదని, వీటిల్లో విదేశీపెట్టుబడుల పెంపుదల పరిమితి విధించడంపై ఎటువంటి ప్రతిపాదన పరిశీలనలో లేద ని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సు భాష్ చంద్ర గార్గ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్ర భుత్వ రంగ బ్యాంకుల్లో 20 శాతం విదేశీ పెట్టుబడులకు కేంద్రం అనుమతించింది. అదే ప్రైవేట్ బ్యాంకుల్లో విదేశీపెట్టుబడుల పరిమితి 74 శాతం వరకు అనుమతించిన విషయం విదితమే. ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకుల ప్రైవేటీకరణపై తనకు ఎటువంటి సమాచారం లేదని ఆయన తెలిపారు. కాగా బ్యాంకుల్లో విదేశీ పెట్టుబడుల పెంపుదల పరిమితిని పెంచితే ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలోని బ్యాంకుల్లోకి నగదు ప్రవాహం పెరుగుతుంది. అనేక కారణాల వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులు నగ దు లేమితో సతమతమవుతున్నాయి. వనరుల కొరత వల్ల ప్రభుత్వం పరిమితులకు లోబడి ప్రభుత్వ బ్యాంకులకు నిధులను సమకూర్చగల దు. వచ్చే రెండేళ్లలో నిరర్ధక ఆస్తులతో నష్టాల్లో కూరుకుంటున్న ప్రభుత్వ బ్యాంకులను ఆదుకునేందుకు కేంద్రం రూ.2.11 లక్షల కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఈ సహాయాన్ని వచ్చే రెండేళ్లలో బ్యాంకులకు అందిస్తారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 20 ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.88,139 కోట్ల నిధులను సమకూర్చింది. ఇందులో ఐడీబీఐ బ్యాంకుకు రూ.10,610 కోట్లను, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.8800 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ. 9232 కోట్లను, యూకో బ్యాంకుకు రూ. 6507 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ. 5473 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడాకు రూ. 5473 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ. 5158 కోట్లు, కెనరాబ్యాంకుకు రూ. 4865 కోట్లు, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకుకు రూ. 4,694 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ. 4524 కోట్లు విడుదల చేశారు. గత ఏడాది డిసెంబర్ 31కి ప్రభుత్వ రంగ బ్యాం కుల నిరార్థక ఆస్తుల విలువ రూ. 8.31 లక్షల కోట్లకు చేరుకుంది. గత మూడున్నర సంవత్సరాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 51వేల కోట్ల పెట్టుబడులను సమకూర్చింది.