బిజినెస్

ఇక విమానంలోనూ ఫోన్ మాట్లాడొచ్చు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూ ఢిల్లీ, మే 1: త్వరలో విమానాల్లో చరవాణి, అంతర్జాల సేవలను ప్రవేశపెట్టేందుకు కేంద్ర టెలికాం శాఖ ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే మూడు నుంచి నాలుగు నెలల్లో ఈ సదుపాయాన్ని విమాన ప్రయాణీకులకు కల్పించనున్నారు. ఇప్పటికే టెలికాం మంత్రిత్వ శాఖ నౌకల్లో ఈ సేవలు అందించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ వివరాలను టెలికాం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్ మంగళవారం ఇక్కడ విలేఖర్లకు తెలిపారు. ప్రస్తుతం భారత గగనతలంలో విమానాల్లో మొబైల్ ఫోన్లను వినియోగించుకునేందుకు అనుమతి లేదు. ప్రస్తుతం అంతర్జాతీయ విమాన సంస్థలు తమ విమానాల్లో వైఫై సేవలను ప్రయాణీకులకు అందిస్తున్నాయి. కాని ఈ విమానాలు భారత గగనతలంలో ప్రవేశించిన వెంటనే వైఫై సేవలను నిలిపేస్తున్నారు. భారత్‌లో పౌర విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. వైఫై సేవలను ఈ విమానాల్లో సమకూర్చడం వల్ల రెవెన్యూ పెరిగే అవకాశం ఉందని అంచనా. టెలికాం కమిషన్ మంగళవారం సమావేశమై ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) చేసిన సిఫార్సులతో దాదాపు ఆమోదం తెలిపిందని సుందరరాజన్ తెలిపారు. విమానాల్లో విదేశీ శాటిలైట్లు, విదేశీ గేట్‌వేలను కూడా అనుమతించాలని ట్రాయ్ పేర్కొన్నట్లు ఆమె చెప్పారు. గతంలో టెలికాం కమిషన్ మాత్రం విమానాల్లో భారతీయ శాటిలైట్, గేట్‌వేలను మాత్రమే భారత్‌లో అనుమతించాలని సిఫార్సు చేసినట్లు ఆమె చెప్పారు. విమానాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలు అందించేందుకు లైసెన్సీదార్ల కోసం ప్రత్యేక కేటగిరీని ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. విమానాల్లో మొబైల్ చార్జీల ఖరారుకు సంబంధించి ఎయిర్ లైన్స్, సర్వీసు ప్రొవైడర్లు పరస్పర అవగాహనకు రావాల్సి ఉంటుందన్నారు. ఈ ఏడాది జనవరిలో ట్రాయ్ సంస్థ విమానాల్లో మొబైల్ సేవలకు పచ్చ జెండా ఊపింది. దీని కోసం ఇన్‌ఫ్లైట్ కనెక్టివిటీ (ఐఎఫ్‌సి)ని ఏర్పాటు చేయాలని ట్రాయ్ పేర్కొంది. వీలైనంత త్వరలో విమానాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలు అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు ట్వీట్ చేశారు.