బిజినెస్

వితంతువుల సంక్షేమం పట్టదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 2: వితంతువులు, ఒంటరి మహిళల సంక్షేమానికి కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలను అమలు చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శించిన ఎనిమిది రాష్ట్రప్రభుత్వాలకు జరిమానాను విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం కూడా ప్రస్తుతం వేరువేరుగా ఉన్న వితంతువుల సంక్షేమానికి సంబంధించిన విధానాలను విలీనం చేసి సమగ్ర, ఏకీకృత విధానాన్ని రూపొందించాలని జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్, జమ్ముకాశ్మీర్, కర్నాటక, ఒడిశా రాష్ట్రాలకు రూ.50వేల చొప్పున, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు రూ.25వేల చొప్పున జరిమానాను సుప్రీం కోర్టు విధించింది. ఈ రాష్ట్రాలు అసమగ్ర సమాచారాన్ని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖకు ఇచ్చినందుకు జరిమానాను విధించారు. ‘ రాష్ట్రప్రభుత్వాలు వితంతువుల సంక్షేమం నిమిత్తం వారిని ఆదుకోవాలనుకునే లక్ష్యం ఉంటే ఆదుకుంటాయి. వీరిని ఆదుకోవద్దనుకుంటే, మేము ఏమి చేయాల్సి ఉంటుంది. కాని రాష్ట్రప్రభుత్వాలకు చీమకుట్టినట్లుగా లేదు. వితంతువుల సంక్షేమం కోసం ఏమి చేయాలనుకోవడం లేదు’ ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు జోక్యం చేసుకుని వితంతువులు, ఒంటరి మహిళల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యల గురించి అదనపు సొలిసిటర్ జనల్ ఏఎన్‌ఎస్ నాదకర్ణిని అడిగింది. వితంతువుల సంక్షేమానికి రకరకాల స్కీంలు ఎందుకు. అన్నింటినీ కలిపి ఒకే విధానాన్ని రూపొందించాలని అదనపు సొలిసిటర్ జనరల్‌కు కోర్టు సూచించింది. ఈ సూచనకు అదనపు సొలిసిటర్ జనరల్ ఏకీభవించారు. వితంతువుల సంక్షేమానికి సంబంధించిన స్కీంల కలిపి ఒకే విధానాన్ని రూపొందించాలన్న ప్రతిపాదనతో ఏకీభవిస్తామని జాతీయ మహిళా కమిషన్ తెలిపింది. ఈ స్కీంకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు. అనంతరం కోర్టు ఈ కేసు విచారణను జూలై 31వ తేదీకి వాయిదావేసింది. తొలుత ఈ కేసును ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన సుప్రీం కోర్టు విచారణ నిమిత్తం చేపట్టింది.