బిజినెస్

ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల విలువైన స్కాంలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 2: గత ఐదేళ్లకాలంలో రూ. లక్షకోట్ల విలువైన అక్రమాలు వివిధ బ్యాంకుల్లో చోటు చేసుకున్నాయి. రిజర్వ్‌బ్యాంకు వెల్లడించిన ప్రకారం వీటికి సంబంధించి 23 వేల కేసులు వెలుగులోకి వచ్చాయి. 2016-17లో మొత్తం ఐదువేల అక్రమ కేసలు నమోదు కాగా, 2017 ఏప్రిల్ నుంచి 2018 మార్చి 1మధ్యకాలంలో వీటి సంఖ్య పెరిగి 5,152 కేసులు నమోదయ్యాయని సమాచార హక్కుపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆర్‌బీఐ వెల్లడించింది. కాగా 2017, ఏప్రిల్ నుంచి 2018 మార్చి వరకు అత్యధిక మొత్తంలో అంటే రూ.28,459 కోట్ల మేర బ్యాంకుల్లో అవకతవకలు జరిగాయని ఆర్‌బీఐ పేర్కొంది. 2016-17లో బ్యాంకుల్లో చోటుచేసుకున్న మొత్తం 5,076 అక్రమాల కేసుల విలువ రూ.23,933 కోట్లు. 2013 నుంచి 2018 మార్చి 1 వరకు, నమోదైన 23,866 కేసుల విలువ రూ.లక్ష కోట్లని ఆర్‌బీఐ తెలిపింది.
4,693 (రూ.18,698 కోట్లు) కేసులు, 4,639 కేసులు (రూ.19,455 కోట్లు) వరుసగా 2015-16, 2014-15 సంవత్సరాల్లో చోటుచేసుకున్నాయని బ్యాంకు వెల్లడించింది. 2013-14లో బ్యాంకులు మొత్తం 4,306 అక్రమాల కేసులను నమోదు చేశాయి. వీటి మొత్తం విలువ రూ.10,170 కోట్లని సెంట్రల్ బ్యాంకు తెలిపింది. ‘ఈ కేసులపై విచారణ జరిపి వాస్తవాలు, పరిస్థితుల ఆధారంగా చర్యలు తీసుకుంటాం’ అని బ్యాంకు తెలిపింది.
కేంద్ర నిఘా సంస్థలైన సీబీఐ, ఈడీలు... బ్యాంకులకు పెద్ద మొత్తంలో రుణాలు ఎగ్గొట్టి తప్పించుకున్న పారిశ్రామిక వేత్తలపై విచారణలు జరుపుతున్న నేపథ్యంలో, సెంట్రల్ బ్యాంకు వెల్లడించిన గణాంకాలకు ప్రాధాన్యత ఏర్పడింది. వీటిల్లో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు సంబంధించిన రూ.13వేలకోట్ల స్కాం ప్రధానమైంది. నీరవ్‌మోదీ ఆయన బంధువు గీతాంజలీ జెమ్స్ ప్రమోటర్ అయిన మెహుల్ చౌస్కీలు ఈ అక్రమానికి పాల్పడ్డట్టు తేలింది.
అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంపై ఇటీవల సీబీఐ రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన ఉన్నతాధికార్లను అరెస్ట్ చేసింది. వీరిలో ఐడీబీఐకి చెందిన మాజీ సీఎండి ఉన్నారు. కాగా మాజీ ఎయిర్‌సెల్ ప్రమోటర్ సి.శివశంకరన్, ఆయన కుమారుడు తాము నిర్వహించే కంపెనీల కోసం రూ.600 కోట్ల మేర ఐడీబీఐ నుంచి అక్రమంగా రుణాలు పొందారన్నది అభియోగం. వీరిని కూడా కేంద్ర నిఘా సంస్థ అరెస్ట్ చేసింది. 2010-14 మధ్యకాలంలో ఐడీబీఐలో వివిధ స్థాయిల్లో పనిచేసిన 15 మంది అధికార్లపై సీబీఐ కేసులు నమోదు చేసింది. వీరంతా శివశంకరన్ కంపెనీలకు అక్రమంగా రుణాలు మంజూరు చేసిన కేసులో నిందితులు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఫిర్యాదు మేరకు సీబీఐ వీరిపై కేసులు నమోదు చేసింది. ఇండియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ కిశోర్ కారత్ (అప్పట్లో ఐడీబీఐ సీఈఓగా పనిచేశారు), సిండికేట్ బ్యాంకులో ఇదే స్థాయిలో పనిచేస్తున్న మెల్విన్ రెగొ (అప్పట్లో ఐడీబీఐకి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు), అప్పట్లో ఐడీబీఐ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన ఎం.ఎస్. రాఘవన్‌ల పేర్లను సీబీఐ తాజాగా నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నది. ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం 2017, డిసెంబర్ చివరి నాటికి దేశంలోని అన్ని బ్యాంకుల నిరర్ధక ఆస్తుల విలువ రూ.8,40,958 కోట్లు. వీటిల్లో పారిశ్రామిక రుణాలు అగ్రస్థానంలో ఉండగా, సేవ మరియు వ్యవసాయ రంగాలు వరుసగా తర్వాతి స్థానాలను ఆక్రమించాయి. అత్యధికంగా రూ.2,01,560 కోట్ల విలువైన నిరర్థక ఆస్తులు కలిగిన బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.55,200 కోట్లు, ఐడీబీఐ రూ.44,542 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.43,474 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.41,649 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.38,047 కోట్లు, కెనరా బ్యాంకు రూ.37,794 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు రూ.33,849 కోట్ల మేర నిరర్థక ఆస్తులను కలిగివున్నాయి. ఈ వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ ప్రతాప్ శుక్లా గత మార్చి 9న లోక్‌సభ ముందుంచారు.