బిజినెస్

ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 2: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం పటిష్ఠమయిన స్థాయి వద్ద ప్రారంభమయినప్పటికీ, అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయం వెలువడనున్న తరుణంలో బలహీనంగా సాగుతున్న ఆసియా మార్కెట్లను అనుసరించి చివరకు ఎదుగూ బొదుగూ లేకుండా ఫ్లాట్‌గా ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ క్రితం సెషన్‌తో పోలిస్తే స్వల్పంగా 16 పాయింట్లు పుంజుకోగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 21 పాయింట్లు పడిపోయింది. ముఖ్యంగా టాటా స్టీల్, హెచ్‌యూఎల్, ఎస్‌బీఐ షేర్ల విలువ పడిపోవడంతో నిఫ్టీ దిగజారింది. నాలుగో త్రైమాసికంలో కార్పొరేట్ కంపెనీలు ఆర్జించిన లాభాలు, వాహనాల విక్రయాలు వంటి అంశాలు మదుపరులలో సానుకూలతను పెంపొందించగా, అదే సమయంలో బలహీనపడిపోతున్న రూపాయి, అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ముడి చమురు ధరలు మదుపరులను అప్రమత్తంగా వ్యవహరించేట్లు చేశాయి. సెనె్సక్స్ మంగళవారం ఉదయం సెషన్‌లో 197 పాయింట్లు పుంజుకొని, ఇంట్రా-డేలో 35,357.15 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు ఏప్రిల్ నెలలో గణనీయంగా పెరగడం కూడా దీనికి దోహదపడింది. అయితే ఇటీవల ధరలు పెరిగిన షేర్లలో మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో ఈ సూచీ ఇంట్రా-డేలో 35,072.42 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 16.06 పాయింట్ల (0.05 శాతం) పైన, 35,176.42 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ క్రితం మూడు సెషన్లలో కలిపి 659.09 పాయింట్లు పుంజుకుంది.
నిఫ్టీ మంగళవారం 10,784.65- 10,689.80 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 21.30 పాయింట్ల (0.20 శాతం) దిగువన 10,718.05 పాయింట్ల వద్ద స్థిరపడింది. ముఖ్యంగా పీఎస్‌యూ, మెటల్ షేర్లు లాభాల స్వీకరణకు గురయ్యాయి. సెనె్సక్స్ ప్యాక్‌లోని షేర్లలో నాలుగో త్రైమాసికంలో మంచి లాభాలు ఆర్జించిన కోటక్ బ్యాంక్ షేర్ ధర మంగళవారం అత్యధికంగా 3.87 శాతం పెరిగి, రూ. 1,257.25 వద్ద ముగిసింది. ఐటీసీ 2.03 లాభంతో రెండో స్థానంలో నిలిచింది. లాభపడిన ఇతర సంస్థల్లో ఆసియన్ పెయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, రిల్, డాక్టర్ రెడ్డీస్ ఉన్నాయి. వాహన రంగంలో బజాజ్ ఆటో షేర్ విలువ 0.31 శాతం పెరిగింది. అయితే మారుతి సుజుకి షేర్ ధర 0.79 శాతం పడిపోయింది. హీరో మోటోకార్ప్, టాటా మోటార్స్, ఎంఅండ్‌ఎం షేర్ల విలువ కూడా పడిపోయింది. సెనె్సక్స్ ప్యాక్‌లోని టాటా స్టీల్ అత్యధికంగా 3.30 శాతం నష్టపోయింది. ఐసీఐసీఐ బ్యాంక్ 2.58 శాతం నష్టపోయింది. నష్టపోయిన ఇతర సంస్థల్లో హెచ్‌యూఎల్, సన్ ఫార్మా, ఎస్‌బీఐ, యెస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, విప్రో, టీసీఎస్, ఎన్‌టీపీసీ, అదాని పోర్ట్స్, ఓఎన్‌జీసీ, భారతి ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్ ఉన్నాయి.