బిజినెస్

ప్రపంచ అభివృద్ధి చోదక శక్తిగా భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జొహెన్నస్ బర్గ్, మే 2: నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించిన తర్వాత భారత్ ప్రపంచానికి తర్వాతి గ్రోత్ ఇంజిన్ కానున్నదని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిశ్రమలను ఆధునికీకరించడం, కొత్త స్టార్ట్-అప్‌లను ప్రారంభించడమే ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలోని భారతీయులనుద్దేశించి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రసంగిస్తూ దేశ కొత్త పారిశ్రామిక విధానం గురించి వివరించారు.
భారత్-దక్షిణాఫ్రికా వాణిజ్య సదస్సు ఏప్రిల్ 29 నుంచి రెండు రోజుల పాటు ఇక్కడ జరిగింది. ప్రభు, ఉన్నత స్థాయి వాణిజ్య వర్గాలతో కలిసి ఈ సదస్సులో పాల్గొన్నారు. 1956లో ప్రారంభించిన మొట్టమొదటి పారిశ్రామిక విధానం పరిశ్రమలకు అధిక ప్రోత్సాహం ఇచ్చింది. అదేవిధంగా 1991లో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో అందుకు అనుగుణమైన విధానాన్ని అనుసరించాల్సి వచ్చిందన్నారు. మంత్రి వెల్లడించిన ప్రకారం, నూతన పారిశ్రామిక విధానంలో మూడు అంశాలున్నాయి.. ప్రస్తుతం ఉన్న పరిశ్రమలను ఆధునికీకరించడం, కొత్త పరిశ్రమలను ముందుకు తీసుకురావడం, స్టార్ట్-అప్‌లను పెంచడం. కాగా చైనా అర్థిక వ్యవస్థ ప్రగతికి ప్రపంచంలో సరితూగే వ్యవస్థ ఏదీ లేదన్న అంశాన్ని సురేష్ ప్రభు అంగీకరించారు. అయితే చైనా వృద్ధికి చైనా ప్రభుత్వ పెట్టుబడులు పెరగడం కారణం. కానీ భారత్ అందుకు పూర్తి భిన్నం. భారత విజయగాధకు భారతీయులే చోదక శక్తులు. దేశంలో ప్రైవేటు రంగం ఇందుకు ఎంతగానో దోహదపడిందన్నారు.
ఈ సంవత్సరం కంటే 2019 భారత్‌పరంగా మంచి ప్రోత్సాహక సంవత్సరం కానున్నదన్నారు. 2017 కంటే 2018లో అధిక ప్రగతి నమోదైంది. అదేవిధంగా 2019లో మరింత ప్రగతి నమోదవుతుందన్నారు. 2020 నాటికి భారత్ తప్పనిసరిగా రెండంకెల వృద్ధికి చేరుకుంటుందన్నారు. 2032 నాటికి భారత్ ప్రపంచంలోనే మూడో బలీయమైన ఆర్థిక వ్యవస్థగా రూపొందడం తథ్యమన్నారు. అప్పటికి మన ముందు యుఎస్, చైనాలు మాత్రమే ఉంటాయన్నారు. 2025 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు, మరో ఏడు సంవత్సరాల్లో 10 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందన్నారు.
నాలుగేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన మోదీ, దేశ గతిశీలతలో సమూల మార్పులు తెచ్చారన్నారు. అందువల్ల ప్రస్తుతం మనం ప్రగతిని కేవలం అంకెల్లో చూడకుండా, దీర్ఘకాలిక సుస్థిరాభివృద్ధి పరంగా చూస్తున్నామన్నారు. ఇప్పటికే ప్రోత్సాహం అందించాల్సిన 12 రంగాలను ప్రభుత్వం గుర్తించిందని, వీటికోసం దాదాపు బిలియన్ డాలర్లను కేటాయించిందని చెప్పారు. ఈ 12 రంగాలు ఉద్యోగాలు కల్పించడమే కాదు, ఎగుమతులను కూడా ప్రోత్సహిస్తాయన్నారు.