బిజినెస్

విమానయాన రంగానికి మహర్దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 2: దేశంలో విమానయాన రంగానికి మహర్దశ పట్టింది. విమానయాన రంగంలో వౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో రూ.5వేల కోట్లతో చెన్నై, లక్నో, గౌహతిలో మూడు కొత్త విమానాశ్రయ టర్మినల్ భవన సముదాయాల నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. బుధవారం ఇక్కడ జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర లభించింది. దేశంలో పౌర విమానయాన రంగం సాలీనా 20 శాతం వృద్ధిరేటును నమోదు చేస్తోంది. ఈ ఏడాది ఒక్క మార్చి నెలలోనే 28 శాతం వృద్ధిరేటు నమోదైంది. దాదాపు 1.16 కోట్ల భారతీయులు విమాన ప్రయాణం చేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు ట్వీట్ చేస్తూ విమానయాన రంగం కొత్త పుంతలు తొక్కనుందని చెప్పారు. చెన్నై విమానాశ్రయానికి రూ. 2467 కోట్లు, మంజూరు చేసినట్లు చెప్పారు. ఈ విమానాశ్రయాన్ని సాలీనా 35 మిలియన్ల మంది ప్రయాణీకులు ప్రయాణించే విధంగా సదుపాయాలను 2027 నాటికి కల్పించనున్నారు. లక్నోలో 13.6 మిలియన్ల మంది ప్రయాణీకులు ప్రయాణించే విధంగా ప్రణాళికను ఖరారు చేశారు. ఇప్పుడు కల్పిస్తున్న సదుపాయాలు 2031 వరకు సరిపోతాయి. ఈ విమానాశ్రయ టర్మినల్ భవన సముదాయానికి రూ. 1232 కోట్లను మంజూరు చేశారు. గౌహతి విమనాశ్రయం అభివృద్ధి, విస్తరణకు రూ. 1383 కోట్లను మంజూరు చేశారు. సాలీనా 9 మిలియన్ల మంది ప్రయాణీకులను హ్యాండిల్‌చేసే విదంగా విమానాశ్రయాన్ని తీర్చిదిద్దనున్నారు.
ఈ విమానాశ్రయం అభివృద్ధి వల్ల తూర్పు ఆసియా విధానానికి ఊతం ఇచ్చినట్లవుతుందని, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వంలో విమానాశ్రయాల అభివృద్ధి వేగవంతమైందన్నారు. పౌర విమానయాన రంగంలో చోటు చేసుకుంటున్న అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని విమానాశ్రయాల్లో నాణ్యమైన అభివృద్ధి సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రంగం అభివృద్ధికి ధీటుగా విమానాశ్రయాలు అభివృద్ధి జరగకపోతే, పెద్ద సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి సురేష్ ప్రభుత్వ ట్వీట్‌లో పేర్కొన్నారు.