బిజినెస్

నోట్ల రద్దు పూర్వస్థాయికి నగదు చెలామణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 3: కర్ణాటక ఎన్నికలు, వృద్ధి రేటు పెరుగుదల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలోకి కరెన్సీ, నోట్లరద్దుకు పూర్వపు స్థాయికి చేరుకుంటోందని, ఒక నివేదిక వెల్లడించింది. ‘కర్ణాటకలో జరుగుతున్న ఎన్నికలు, నామమాత్ర కార్యకలాపాల వల్ల నగదుకు డిమాండ్ కు బహుశా కారంణం కావచ్చు’ అని జపాన్‌కు చెందిన బ్రోకరేజ్ సంస్థ నోమురా వెల్లడించింది. నోట్ల రద్దుకు ముందు దేశంలో కరెన్సీ డిమాండ్ జీడీపీలో దాదాపు 12 శాతం వరకు ఉండేది. కానీ నోట్ల రద్దు తర్వాత, ప్రభుత్వం డిజిటల్ లావాలదేవీలను ప్రోత్సహించింది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థలో నగదు చెలామణి తగ్గిపోయింది. కానీ ప్రస్తుత పోకడలు చూస్తుంటే ‘ఈ అంచనాలన్నీ తల్లక్రిందులై, నగదు చెలామణి పూర్వపు స్థాయికి దాదాపుగా చేరుకోవడం నిరుత్సాహకరమే’ అని సంస్థ స్పష్టం చేసింది. ఏప్రిల్ నెలలో నగదు చెలామణి జీడీపీలో 11.3 శాతానికి చేరుకుంది. అంటే నోట్ల రద్దుకు ముందు ఇది 11.5 నుంచి 12 శాతం వరకు ఉండేది. ఈ లెక్కన నగదుకు మళ్లీ పూర్వపు ‘ప్రాధాన్యత’ ఏర్పడిందని నివేదిక పేర్కొంది. కొత్త నోట్ల ముద్రణ, కర్ణాటకలో ఎన్నికల కారణంగా 2017లో ఆర్థిక వ్యవస్థలో నగదు విపరీతంగా పెరిగిపోయింది. కర్ణాటకలో ఎన్నికలు మే 12న జరుగనున్నాయి. పదిహేను రోజుల క్రితం మళ్లీ దేశంలో నగదు కొరత ఏర్పడటంతో అధికార్లు అప్రమత్తమై, కొన్ని డినామినేషన్ల నోట్ల ప్రింటింగ్‌ను ఐదురెట్లు పెంచారు. కాగా కర్ణాటకతో పాటు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నగదు కొరత ఏర్పడింది. ఉత్తరాది రాష్ట్రాలైన మిహార్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్ రాష్ట్రాలు కూడా నగదు లేక విలవిలలాడాయి. ఇటీవల బ్యాంకుల్లో చోటుచేసుకుంటున్న అవినీతి పుణ్యమాని ప్రజలు భయంతో బ్యాంకుల్లో డిపాజిట్లు చేయకపోవడమే ఇందుకు కారణమన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.