బిజినెస్

మళ్లీ వాణిజ్య యుద్ధ భయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 3: నాలుగు రోజుల పాటు పెరిగిన బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ ప్రపంచ స్టాక్ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల ధోరణి ప్రభావం వల్ల గురువారం పడిపోయింది. భారత స్టాక్ మార్కెట్లలోనుంచి ఫారిన్ ఫండ్‌ల పెట్టుబడుల ఉపసంహరణ నిరంతరాయంగా కొనసాగుతుండటంతో పాటు ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, మరికొన్ని కంపెనీల నాలుగో త్రైమాసిక లాభాలు ఊహించిన దానికన్నా తక్కువగా ఉండటం కూడా మదుపరులను ఆందోళనకు గురిచేసింది. అమెరికా, చైనాల మధ్య తలెత్తిన వాణిజ్య వివాద పరిష్కారానికి మార్గాన్ని అనే్వషించేందుకు ఇరు దేశాల అధికారులు బీజింగ్‌లో భేటీ అయ్యారు. అయితే, ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలయిన ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య వివాదానికి తెరదించేలా దొరుకుతుందని భావిస్తున్న పరిష్కారం పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వాణిజ్య వివాదం ప్రభావం కూడా గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లపై పడింది. సెనె్సక్స్ గురువారం 73 పాయింట్లు పడిపోయి, 35,103.14 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 38.40 పాయింట్లు తగ్గి 10,679.65 పాయింట్ల వద్ద స్థిరపడింది. మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో స్థిరాస్తి, క్యాపిటల్ గూడ్స్, ఐటీ, టెక్నాలజి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎఫ్‌ఎంసీజీ, కన్స్యూమర్ డ్యూరేబుల్స్, చమురు- సహజ వాయువు, వాహన రంగాల షేర్ల విలువ పడిపోయింది. గురువారం అధిక స్థాయి వద్ద ప్రారంభమయిన సెనె్సక్స్ కొద్ది సేపటికే బలహీనంగా ఉన్న ఆసియా మార్కెట్లను అనుసరిస్తూ ప్రతికూల ధోరణిలోకి వెళ్లిపోయి, ఇంట్రా-డేలో 35,020.08 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. తరువాత కాస్త పుంజుకున్నప్పటికీ క్రితం ముగింపుతో పోలిస్తే 73.28 పాయింట్ల (0.21 శాతం) దిగువన 35,103.14 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ క్రితం నాలుగు సెషన్లలో కలిసి 675.15 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ గురువారం కీలకమయిన 10,700 పాయింట్ల స్థాయికన్నా దిగువకు దిగజారి, క్రితం ముగింపుతో పోలిస్తే 38.40 పాయింట్ల (0.36 శాతం) దిగువన 10,679.65 పాయింట్ల వద్ద స్థిరపడింది. అంతకు ముందు ఈ సూచీ 10,720.60- 10,647.45 పాయింట్ల మధ్య కదలాడింది. ఇదిలా ఉండగా, బుధవారంనాటి లావాదేవీల్లో ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇనె్వస్టర్లు (ఎఫ్‌ఐఐలు) రూ. 525.93 కోట్ల విలువయిన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) రూ. 165.84 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేశారు.
గురువారంనాటి లావాదేవీల్లో సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో విప్రో అత్యధికంగా 1.94 శాతం నష్టపోయింది. కోటక్ మహీంద్ర బ్యాంక్ 1.90 శాతం నష్టపోయింది. నష్టపోయిన ఇతర సంస్థల్లో ఆసియన్ పెయింట్స్, ఎల్‌అండ్‌టీ, హెచ్‌యూఎల్, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్, రిల్, ఐటీసీ లిమిటెడ్, భారతి ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, టీసీఎస్, అదాని పోర్ట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యెస్ బ్యాంక్, హీరో మోటోకార్ప్ ఉన్నాయి. మరోవైపు, సన్ ఫార్మా, టాటా స్టీల్, ఎన్‌టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, ఓఎన్‌జీసీ, పవర్ గ్రిడ్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ షేర్ల విలువ పెరిగింది.