బిజినెస్

సిమెంట్ కంపెనీల లాభాలు తగ్గొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 3: కారుబొగ్గు (పెట్ కోక్), బొగ్గు, డీజిల్ ధరలు పెరగడం వల్ల సమీప భవిష్యత్తులో సిమెంట్ కంపెనీల లాభాలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని, వాటి రుణాలపైనా ప్రభావం చూపనుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తన నివేదికలో పేర్కొంది. బొగ్గు, పెట్ కోక్ ధరలు పెరగడం వల్ల సిమెంట్ కంపెనీల పవర్, ఇంధనం వ్యయం పెరిగిందని, డీజిల్ ధర పెరగడం వల్ల రవాణా వ్యయం పెరిగిందని, సమీప భవిష్యత్తుల్లో ఈ పెరుగుదల కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. అందువల్ల సిమెంట్ కంపెనీల లాభాలు తగ్గిపోవచ్చని పేర్కొంది. సిమెంట్ కంపెనీల లాభదాయకత కోణంలోనుంచి చూసినప్పుడు సిమెంట్ ధరల పెరుగుదల అనేది ఎంతో కీలకమయిందని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సవ్యసాచి మజుందార్ పేర్కొన్నారు. 3క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2017-18లో బొగ్గు ధరలు 24 శాతం, డీజిల్ ధర 6.9 శాతం చొప్పున పెరిగాయి. పెట్ కోక్ ధరలు 2017-18 ఆర్థిక సంవత్సరం తొలి మూడు త్రైమాసికాలలో 54, 16, 20 శాతం చొప్పున పెరిగాయి2 అని ఆ నివేదిక వెల్లడించింది. ప్రభుత్వం నిరుడు డిసెంబర్‌లో పెట్ కోక్‌పై దిగుమతి సుంకాన్ని అంతకు ముందున్న 2.5 శాతం నుంచి పది శాతానికి పెంచింది. దిగుమతి సుంకాన్ని పెంచడం వల్లనే పెట్ కోక్ ధరలు పెరిగాయని ఇక్రా నివేదికలో పేర్కొంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో సిమెంట్‌కు డిమాండ్ 5-6 శాతం మేరకు పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీ అంచనా వేసింది. ముఖ్యంగా గ్రామీణ గృహ నిర్మాణం, వౌలిక సౌకర్యాల రంగాల వల్ల సిమెంట్‌కు డిమాండ్ పెరుగుతుందని పేర్కొంది. వౌలిక సౌకర్యాలలో ప్రధానంగా రహదారులు, నీటిపారుదల ప్రాజెక్టుల వల్ల డిమాండ్ పెరుగుతుందని తెలిపింది.