బిజినెస్

ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 8: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఎదుగూ బొదుగూ లేకుండా ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బాగా పెరగడం తో పాటు భౌగోళిక రాజకీయ అనిశ్చితి నెలకొని ఉన్న పరిస్థితులలో మదుపరులు లాభా ల స్వీకరణకు పూనుకోవడం వల్ల దేశీయ మా ర్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ విలువ మంగళవారం సుమారు 7శాతం పెరిగింది. దీంతో ఈ సెషన్‌లో అత్యధికంగా ల బ్ధి పొందిన సంస్థగా ఐసీఐసీఐ నిలిచింది. సో మవారం వెలువడిన ఐసీఐసీఐ బ్యాంక్ నాలు గో త్రైమాసిక ఫలితాలలో ఆ బ్యాంకు నికర లాభం 45శాతం తగ్గింది. ఆస్తుల వర్గీకరణ మార్గదర్శకాలలో మార్పుల కారణంగా మొండి బకాయిలు పెరిగిపోవడంతో ఈ బ్యాంకు నిక ర లాభం గణనీయంగా తగ్గిపోయింది. నికర లాభం గణనీయంగా తగ్గినప్పటికీ, మొండి బకాయిలను వసూలు చేయడం, పరిష్కరించడంపై దృష్టి పెట్టినట్టు ఐసీఐసీఐ బ్యాంకు ప్రకటించడంతో ఆ బ్యాంక్ షేర్ల పట్ల మదుపరులు మక్కువ చూపారని బ్రోకర్లు తెలిపారు. అమెరికా ఇరాన్‌పై మళ్లీ ఆంక్షలు విధించడంతో చమురు సరఫరాలకు ఆటంకం కలుగుతుందేమోననే భయాందోళనలు నెలకొని అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బారెల్‌కు 75 డాలర్లకు పైగా పెరిగిపోయాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ మంగళవారం సానుకూల స్థాయి వద్ద ప్రారంభమయి, మరింత ముందుకు సాగుతూ ఇంట్రా-డేలో 35,388.87 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే, ఈ వారంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడం వల్ల ఈ సూచీ దిగజారి 35,136.01 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 8.18 పాయింట్ల (0.02 శాతం) లాభంతో 35,216.32 పాయింట్ల వద్ద ముగిసింది.
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కూడా ఇంట్రా-డేలో 10,758.55 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకినప్పటికీ, చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే కేవలం 2.30 పాయింట్లు (0.02 శాతం) పుంజుకొని, 10,717.80 పాయింట్ల వద్ద స్థిరపడింది. అంతకు ముందు ఈ సూచీ ఇంట్రా-డేలో 10,689.40 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. ఇదిలా ఉండగా, సోమవారంనాటి లావాదేవీల్లో దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) నికరంగా రూ. 1,037.23 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేయగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ. 635.24 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు.
మంగళవారంనాటి లావాదేవీల్లో సెనె్సక్స్ ప్యాక్‌లోని ఐసీఐసీఐ బ్యాంక్ అత్యధికంగా 6.86 శాతం లబ్ధి పొందింది. ఎస్‌బీఐ 1.42 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.18 శాతం చొప్పున లబ్ధి పొందాయి. లాభపడిన ఇతర సంస్థల్లో పవర్ గ్రిడ్, భారతి ఎయిర్‌టెల్, ఎన్‌టీపీసీ, టీసీఎస్, మారుతి సుజుకి, కోల్ ఇండియా, అదాని పోర్ట్స్, ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌యూఎల్ ఉన్నాయి. మరోవైపు, ఎంఅండ్‌ఎం షేర్ విలువ 2.26 శాతం పడిపోయింది. నష్టపోయిన ఇతర సంస్థలలో ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ, ఇన్ఫోసిస్, యెస్ బ్యాంక్, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, విప్రో, ఆసియన్ పెయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ, రిల్, సన్ ఫార్మా, ఓఎన్‌జీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉన్నాయి.