బిజినెస్

ఔదార్యమే చెలిమికి ఆయువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, మే 9: భారత్-చైనాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింత గట్టిపడాలంటే ఇరు దేశాల ఆకాంక్షలు, ఆసక్తులపట్ల పరస్పరం సానుభూతితో వ్యవహరించాలని భారత దౌత్యాధికారి గౌతమ్ బాంబేవాలా అభిప్రాయపడ్డారు. భారత్-చైనా 8వ ద్వైపాక్షిక చర్చలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేయాల్సిన తరుణంలో, బాంబేవాలా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘ఒక దేశం ఆకాంక్షలు, ఆసక్తుల పట్ల పొరుగు దేశం సానభూతితో వ్యవహరించాలన్న సన్నితమైన నిబంధన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేయగలదు’ అని బాంబేవాలా వ్యాఖ్యానించారు. అలాంటి భావన ఇరు దేశాల మధ్య కరవైతే, చర్చలైతే కొనసాగుతాయికానీ ఫలితాలు ఆశాజనకంగా ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల మధ్య సాగిన ఆత్మీయ అనధికార చర్చల సారాన్ని ప్రస్తావిస్తూ ‘ఇద్దరు నేతలు మనసువిప్పి మాట్లాడుతున్నారు. అంతర్జాతీయ, ప్రాంతీయ పరిస్థితులపై వ్యూహాత్మకంగా ఎలా ముందుకు వెళ్లాలో మాట్లాడుతున్నారు. ఈ అనధికార చర్చల్లోనే భారత్ -చైనా బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిగగానూ అడుగులేశారు’ అని చైనాలో భారత అంబాసిడర్ గౌతమ్ బాంబేవాలా గుర్తుచేశారు.
డోక్లాంలో 73రోజుల పాటు సాగిన సైనిక ప్రతిష్టంభన అంశం తరువాత ఇరుపక్షాలూ పరస్పరం సానుభూతితో ముందుకొచ్చి ఏప్రిల్ 27, 28 తేదీల్లో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు ఆత్మీయ అనధికార చర్చలు సాగించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ‘ఉన్నతస్థాయిలో మర్యాదపూర్వకంగా సాగే చర్చలు ఎలాంటి ప్రతిఫలాన్నిస్తాయో వారిద్దరి భేటీని బట్టి అర్థం చేసుకోవచ్చని గౌతమ్ వ్యాఖ్యానించారు.