బిజినెస్

నష్టపోయిన దేశీయ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 10: మూడు రోజుల పాటు లాభాలు చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్పంగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడంతో పాటు రూపాయి బలహీనపడిన పరిస్థితుల్లో మదుపరులు కొనుగోళ్లకు దూరంగా ఉండటం వల్ల మార్కెట్ కీలక సూచీలు స్వల్పంగా పడిపోయాయి. కర్ణాటకలో శనివారం అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో మార్కెట్‌లో మదుపరులు ఆచితూచి వ్యవహరించారు. విదేశీ ఫండ్‌లు భారత స్టాక్ మార్కెట్లలోనుంచి తమ పెట్టుబడుల ఉపసంహరణను నిరంతరాయంగా కొనసాగిస్తున్నప్పటికీ, కొన్ని కంపెనీలు నాలుగో త్రైమాసికంలో సాధించిన ఆకర్షణీయమయిన లాభాలు కీలక సూచీలు మరింత పడిపోకుండా నిరోధించగలిగాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ గురువారం 73.08 పాయింట్లు పడిపోయి, 35,246.27 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 25.15 పాయింట్లు తగ్గి, 10,716.55 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెనె్సక్స్ గురువారం ఉదయం సెషన్‌లో 128 పాయింట్లు పుంజుకొని 35,500.76 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకినప్పటికీ, కొద్ది సేపటికే 35,203.85 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 73.08 పాయింట్ల (0.21 శాతం) దిగువన 35,246.27 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ క్రితం మూడు సెషన్లలో కలిసి 403.97 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ గురువారం 10,705- 10,785.55 పాయింట్ల మధ్య కదలాడి, చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 25.15 పాయింట్ల (0.23 శాతం) దిగువన 10,716.55 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇదిలా ఉండగా, బుధవారంనాటి లావాదేవీలలో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ. 704.03 కోట్ల విలువయిన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) రూ. 664.92 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేశారు. సెనె్సక్స్ ప్యాక్‌లోని బాగా నష్టపోయిన సంస్థల్లో డాక్టర్ రెడ్డీస్, టాటా మోటార్స్, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో, టాటా స్టీల్, ఎన్‌టీపీసీ, టీసీఎస్, యెస్ బ్యాంక్, ఐటీసీ లిమిటెడ్ ఉన్నాయి. మరోవైపు, ఓఎన్‌జీసీ, భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ (రిల్), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోల్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్ల విలువ పెరిగింది. రంగాలవారీగా చూస్తే, బీఎస్‌ఈ రియల్టీ ఇండెక్స్ అత్యధికంగా 2.02 శాతం పడిపోయింది. పవర్ 1.55 శాతం నష్టంతో రెండో స్థానంలో నిలిచింది. హెల్త్‌కేర్, కన్స్యూమర్ డ్యూరేబుల్స్, క్యాపిటల్ గూడ్స్, మెటల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ, ఆటో, ఐటీ, బ్యాంకెక్స్ సూచీలు కూడా పడిపోయాయి. అయితే, చమురు- సహజ వాయువు రంగం సూచీ స్వల్పంగా పుంజుకుంది.