బిజినెస్

కర్ణాటక ఫలితాలే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 13: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ద్రవ్యోల్బణం గణాంకాలు, ముడి చమురు ధరల కదలికలు, కొన్ని బ్లూచిప్ కంపెనీల నాలుగో త్రైమాసిక (క్యూ4) ఫలితాలు వంటి అంశాలు సోమవారం నుంచి మొదలయ్యే వచ్చే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ల సరళిని నిర్దేశించనున్నాయనేది నిపుణుల అంచనా. వచ్చే వారం తమ నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్న కంపెనీలలో హిందుస్తాన్ యూనిలీవర్, లుపిన్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), హిండా ల్కో ఇండస్ట్రీస్, ఐటీసీ ఉన్నాయి. 3వచ్చే దశ నాలుగో త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌కు ఎంతో కీలకమయినవి. ఈ ఫలితాలు నిరుత్సాహకరంగా ఉంటే స్టాక్ మార్కెట్ కీలక సూచీలు పడిపోతాయి. వచ్చే వారం ద్రవ్యోల్బణం గణాంకాలు, కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ రెండు అంశాలను మదుపరులు జాగ్రత్తగా గమనిస్తున్నారు2 అని జియోజిత్ ఫైనాన్సియ ల్ సర్వీసెస్ పరిశోధన విభాగం అధిపతి వినోద్ నాయర్ పేర్కొన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 15న వెలువడనున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు స్టాక్ మార్కెట్‌లో కొంత వరకు అనిశ్చితిని సృష్టించే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మదుపరులు వాటిపై దృష్టి కేంద్రీకరించారు. వినియోగ వస్తువుల ఆధారిత (సీపీఐ) ద్రవ్యోల్బణం వంటి స్థూలార్థిక గణాంకాలు కూడా వచ్చే వారం వెలువడనున్నాయి. ఇవి కూడా దేశీయ స్టాక్ మార్కెట్ ధోరణిని నిర్దేశిస్తాయి. ఇరాన్‌తో కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి వైదొలగాలని అమెరికా నిర్ణయించుకున్నందున, దాని ప్రతికూల ప్రభావం పడే ముడి చమురు ధరల కదలికలపైనా మార్కెట్ దృష్టి సారిస్తుంది2 అని కోటక్ సెక్యూరిటీస్ పీసీజీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ జర్బాడే పేర్కొన్నారు. దేశీయమయిన అంశాలతో పాటు ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిణామాలు ముఖ్యంగా మధ్య ప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితులు స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తాయని నిపుణులు పేర్కొన్నారు. 3దేశీయ స్టాక్ మార్కెట్లను గణనీయంగా ప్రభావితం చేయగలిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వైపు ప్రతి ఒక్కరూ చూస్తున్నప్పటికీ, మార్కెట్లకు నిజమయిన ముప్పు ఇరాన్- ఇజ్రాయెల్ వైరుధ్యం నుంచే పుట్టుకొస్తుంది. ఇరాన్‌తో కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగిన తరువాత ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య వైరుధ్యం యుద్ధం స్థాయికి పెరిగే అవకాశం ఉంది2 అని సామ్‌కో సెక్యూరిటీస్ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో) జిమీత్ మోదీ పేర్కొన్నారు. 3ముడి చమురు ధరలు అధికంగా ఉండటం, డాలర్ పటిష్ఠంగా ఉండటం అనేవి బుల్స్‌కు అపశకునం వంటివి. అందువల్ల స్టాక్ మార్కెట్లు ఒత్తిడికి గురవుతాయి. అనిశ్చితి నెలకొంటుంది2 అని ఆయన వివరించారు. 3మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు, వాటికన్నా ముందు మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. అందువల్ల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పట్ల ప్రజల విశ్వాసం కోణంలోనుంచి చూడడం జరుగుతుంది. ఈ ఫలితాలు ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ భవితవ్యాన్ని సూచిస్తాయి. స్వల్పకాలికంగా చూస్తే మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడం వల్ల మార్కెట్‌లో అనిశ్చితి నెలకొనే అవకాశం ఉంది2 అని ఎపిక్ రీసెర్చ్ సీఈవో ముస్త్ఫా నదీమ్ పేర్కొన్నారు. శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 620.41 పాయింట్లు (1.78 శాతం) పుంజుకొని, 35,535.79 పాయింట్ల వద్ద ముగిసింది.