బిజినెస్

చెల్లింపుల స్వీకరణలో మేటి భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, మే 13: విదేశాలకు వెళ్లి కష్టపడి సంపాదించి దాచుకున్న సొమ్మును ఇంటికి పంపించే దేశాల్లో భారత్ ప్రపంచం మొత్తం మీద అగ్రస్థానంలో ఉంది. భారత్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు జీవనోపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లి పనిచేస్తారు. ఆసియా పసిఫిక్ రీజియన్‌లోని దేశాలకు 2017 సంవత్సరంలో 256 బిలియన్ల డాలర్లను ఇంటికి పంపించారు. ఇందులో భారత్‌లో ఉంటున్న తమ కుటుంబ సభ్యులకు 69 బిలియన్ డాలర్లను భారతీయులు చెల్లింపులు చేశారు. రెమిట్ స్కోప్ రెమిటెన్స్ మార్కెట్స్ అవకాశాలు అనే అంశంపై ఆసక్తికరమైన వివరాలను ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్ అనే సంస్థ ప్రచురించింది. చైనాకు 64 బిలియన్ డాలర్లు, ఫిలిప్పైన్స్‌కు 33 బిలియన్ డాలర్లను విదేశాల్లో ఉన్న ఆ దేశ ప్రజలు పంపారు. ప్రపంచంలోనే కుటుంబ సభ్యులకు చెల్లింపులు చేసే దేశాల్లో వరుసగా పై దేశాలు అగ్ర భాగాన నిలిచాయి. పాకిస్తాన్‌కు 20 బిలియన్ డాలర్లు వియత్నాంకు 14 బిలియన్ డాలర్లు చెల్లింపుల ద్వారా అందుతున్నాయి. గల్ఫ్ దేశాల నుంచి 32 శాతం, ఉత్తర అమెరికా నుంచి 26 శాతం, ఐరోపా నుంచి 12 శాతం మేర చెల్లింపులు భారత్, చైనా, ఫిలిప్పైన్స్‌దేశాలకు అందుతున్నాయి. 2030 నాటికి చెల్లింపులు ఆరు ట్రిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది. 2008 నుంచి చెల్లింపులు సాలీనా 4.87 శాతం వృద్ధిరేటు నమోదు చేస్తున్నాయి. ప్రపంచం మొత్తం మీద 40 శాతం నగదు చెల్లింపులు గ్రామీణ ప్రాంతాలకు చేరుతాయి. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి నేపాల్‌లో 81 శాతం, భారత్‌లో 67 శాతం, వియత్నాంలో 66 శాతం, బంగ్లాదేశ్‌లో 65 శాతం, పాకిస్తాన్‌లో 61 శాతం, ఫిలిప్పైన్స్‌లో 56 శాతం చెల్లింపులు జరుగుతున్నట్లు ఐఎఫ్‌ఎడి పేర్కొంది. ఆసియాపసిఫిక్ రీజియన్‌లో 400 మిలియన్ల మంది ఉన్నారు. వీరిలో ప్రతి పది మందిలో ఒకరు చెల్లింపులు తీసుకోవడం, లేదా చెల్లింపులు చేయడమో జరుగుతోందని ఈ సంస్థపేర్కొంది. ఈ ప్రాంతంలో మొత్తం 320 మిలియన్ల కుటుంబ సభ్యులు చెల్లింపుల ద్వారా లబ్ధి పొందుతున్నారు.