బిజినెస్

ఈ-రిక్షా టైర్లపై 28శాతం జీఎస్‌టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 13: ఇ రిక్షా టైర్లకు వస్తు సేవా పన్ను (జిఎస్‌టి) 28 శాతం శ్లాబు వర్తిస్తుందని ముంబాయికి చెందిన అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ (ఏఏఆర్) స్పష్టం చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇ-రిక్షా టైర్లను మోటార్ వాహనాల కేటగిరీలో మోటారు వాహనాల చట్టం కింద నమోదు చేశారు. అందు వల్ల ఇ-రిక్షాలు 28% జీఎస్‌టీ శ్లాబ్ పరిధిలో వస్తాయని ఏఏఆర్ పేర్కొంది. టైర్ల కంపెనీ సియట్ లిమిటెడ్ దాఖ లు చేసిన దరఖాస్తుపై ఏఏఆర్ రూలింగ్ ఇచ్చింది. ఈ రిక్షాను మూడు చక్రాల పవర్డ్ సైకిల్ రిక్షాగా వర్గీకరిస్తే ఐదు శాతం జీఎస్‌టీ కింద కేటాయించే అవకాశంపై స్పష్టత ఇవ్వాలని సియట్ సంస్థ ఏఏఆర్‌ను కోరింది. ఇ రిక్షాలకు పెడల్ ఉండదని, పవర్డ్ సైకిల్ రిక్షాగా వర్గీకరించారని ఏఏఆర్ పేర్కొంది. ఈ రిక్షాలు, పవర్డ్ సైకిల్ రిక్షా లు వేరువేరని ఏఏఆర్ పేర్కొంది. ఏఎంఆర్‌జీ అసోసియేట్స్ భాగస్వామి రాజత్ మోహన్ మాట్లడుతూ ఇ రిక్షా టైర్లపై 28 శాతం జీఎస్‌టీని విధించడం అసమంజసమన్నారు. పేదలకు జీవనోపాధి కల్పించే లక్ష్యంతో ఇ రిక్షా టైర్లను తయా రు చేసినట్లు చెప్పారు. 28 శాతం జిఎస్‌టి కేటగిరీ కింద 229 ఐటమ్స్‌ను తీసుకురానున్నారు. ఇంతవరకు 51 ఐటమ్స్ ఈ పరిధిలోకి తెచ్చారు.