బిజినెస్

పింఛనుదార్లకు మార్గదర్శకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 14: పదవీ విరమణ చేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దరఖాస్త్ఫురాలపై సెల్ఫీ ఫోటోలను ఉపయోగించవద్దని కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఎవరైనా అటువంటి ఫోటోలు ఉంచినట్లయితే వాటిని అనుమతించబోమని తెలిపింది. సివిల్ పింఛనుదార్లు ఏం చేయాలి, ఏం చేయకూడదనే వాటిపై నిర్దిష్ట మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం నల్లకళ్లద్దాలను ధరించిన కలర్ ఫోటోలను అనుమతించరు. ఉద్యోగులు పొడవైన జుట్టు కళ్లపై పడే విధంగా ఉండే ఫోటోలను దరఖాస్తు ఫారాలకు జత చేయకూడదు. దరఖాస్తు ఫారంలో సంతకం కోసం నిర్దేశించిన బాక్స్ కంటే చిన్నసైజులో సంతకం పెట్టకూడదు. బాక్స్‌కు సరిపోయే పరిమాణంలో సంతకం ఉండాలి. ఇక సెల్ఫీ ఫోటోలను ఎంతమాత్రం అనుమతించరు.
కేంద్ర ప్రభుత్వ సివిల్ పింఛనర్లు, తమ భార్య/్భర్తతో కలిసి దిగిన ఫోటోలను మూడు కాపీలు, కేంద్రకార్యాలయం అటెస్టేషన్‌తో సమర్పించాలి. సెంట్రల్ సివల్ సర్వీస్ పెన్షన్ రూల్స్ 1972కు చెందిన 5వ నెంబరు ఫారంతో పాటు పై ఫోటోలను జతచేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగి తప్పనిసరిగా ఈ దరఖాస్తును తీసుకొని, అందులోని అన్ని భాగాలను నింపి, కేంద్ర కార్యాలయం నుంచి పంపాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఒక ఉద్యోగి రిటైర్ అవడానికి ఎనిమిది నెలల ముందు పూర్తి కావాల్సి ఉంటుంది. ఫోటోల కంప్యూటర్ ప్రింట్‌ను కూడా అనుమతించరు. పోటోలపై సంతకాలు చేయకూడదు. కేంద్ర సిబ్బంది మంత్రిత్వశాఖ తాజాగా ఈ మార్గదర్శకాలను అన్ని ప్రభుత్వ శాఖలకు పంపింది. వీటిని అనుసరిస్తే ప్రభుత్వ ఉద్యోగి పింఛను కోసం దీర్ఘకాలం వేచి చూడకుండా సరైన సమయంలో పొందేందుకు వీలవుతుందని మంత్రిత్వశాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.