బిజినెస్

వాణిజ్య ఆదాయంతో నష్టాల తగ్గింపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 14: దాదాపు 4వేల కోట్ల రూపాయల భారీ నష్టాలతో తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న ఏపీఎస్ ఆర్టీసీని నష్టాల బారి నుంచి ఏదోవిధంగా బయట పడేసేందుకు యాజమాన్యం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. గత ఏడాదిగా ఎం మాలకొండయ్య, కొద్ది మాసాలుగా ప్రస్తుత ఎండీ ఎన్వీ సురేంద్రబాబు ఓవైపు ఆక్యుపెన్సీ రేషియో పెంపునకు అనేక సంస్కరణలు తీసుకొచ్చి వాణిజ్య ఆదాయం పెంపుపై దృష్టి సారించారు. ప్రధాన బస్‌స్టేషన్లలో వాణిజ్య, వ్యాపార సంస్థలకు షోరూంల నిర్మాణానికి స్థలం కేటాయింపునకు చర్యలు చేపట్టారు. విజయవాడ బస్‌స్టేషన్‌లో రెండు మినీ థియేటర్ల ఏర్పాటుకు స్థలం కేటాయించారు. ఇలా వాణిజ్యపరంగా ఆదాయం ఏటేటా గణనీయంగా పెరుగుతోంది.
2016-17 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు 11 నెలలపాటు రూ. 109కోట్ల 11లక్షలు రాబడి రాగా, 2017-18 ఆర్ధిక సంవత్సరంలో ఇదే కాలానికి రూ. 142కోట్ల 82లక్షలు ఆదాయం వచ్చింది. అంటే 31శాతం వృద్ధితో రూ. 33కోట్ల 71లక్షలు ఆదాయం గతం కంటే పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ. 25.41 కోట్లతో కృష్ణా ప్రథమ స్థానం, రూ. 16.89 కోట్లతో తిరుపతి రెండో స్థానం, రూ. 11.16 కోట్ల ఆదాయంతో కర్నూలు తృతీయ స్థానానికి చేరాయి. తర్వాత రూ. 11.07 కోట్లతో విశాఖ, రూ. 10.74 కోట్లతో గుంటూరు, రూ. 10.32 కోట్లతో తూర్పుగోదావరి, రూ. 10.02 కోట్లతో ప్రకాశం, రూ. 9.59 కోట్లతో అనంతపురం, రూ. 7.08 కోట్లతో విజయనగరం, రూ. 5.66 కోట్లతో పశ్చిమగోదావరి జిల్లా, రూ. 5.97 కోట్లతో వైఎస్సార్ కడప, రూ. 7.59 కోట్లతో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరుస స్థానాల్లో నిలిచాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో మొత్తంపై నష్టం రూ. 850 కోట్లు రాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అది రూ. 500 కోట్లకు తగ్గింది. మొత్తంపై ఏటేటా నష్టాలను తగ్గిస్తూ రావాలని యాజమాన్యం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.