బిజినెస్

జోరందుకున్న ఇళ్ళ అమ్మకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 14: గత ఏప్రిల్ నెలలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు బాగా పెరిగాయి. అంతకు ముందు నెలతో పోలిస్తే 1726 యూనిట్లు పెరిగినట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్ ఏఎన్‌ఆర్‌ఓసీకె వెల్లడించింది. ఇదే ఏడు నగరాల్లో మార్చి నెలలో ఇళ్ల అమ్మకాలు 1382 యూనిట్లుగా నమోదయ్యాయి. నేషనల్ కేపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్), ముంబయి మెట్రోపోలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూణె నగరాల్లో ఇళ్ల అమ్మకాల పోకడలను పరిశీలించిన సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. కేవలం ఒక్క నెల కాలంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఇళ్ల అమ్మకాలు ఒక్కసారిగా జోరందుకోవడం గమనార్హం. అయితే ఏప్రిల్ నెలలో కోల్‌కతా, పూణె నగరాలను మినహాయించి, మిగిలిన వాటిల్లో ఇళ్ల అమ్మకాలు వేగంగా పెరగడం గమనార్హం. ‘వినియోగదారుల్లో నెలకొన్న సానుకూల పరిణామాల నేపథ్యంలో, త్రైమాసికాల వారీగా డిమాండ్ పెరుగుతూ వస్తోందని ఎఎన్‌ఆర్‌ఓసీకె (అనరాక్) చైర్మన్ అనుజ్ పూరి అన్నారు. నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో (ఎన్‌సీఆర్) కేవలం ఒక్కనెలలోనే గృహకొనుగోళ్లు 153 శాతం పెరిగాయి. అదేవిధంగా బెంగళూరు 41%, ఎంఎంఆర్ 29% చొప్పున ఇళ్ల అమ్మకాల పెరుగుదలను నమోదు చేశాయి. అనరాక్ సమాచారం ప్రకారం బెంగళూరులో మార్చి నెలలో 196 యూనిట్లు అమ్మకాలు జరగ్గా, ఏప్రిల్‌లో ఇవి 278 యూనిట్లకు పెరిగాయి. ఇక ఎంఎంఆర్‌లో ఇదే కాలంలో 399 నుంచి 516 యూనిట్లకు అమ్మకాలు పెరిగాయి. ఇక ఎన్‌సీఆర్‌లో ఇళ్ల అమ్మకాలు 96 యూనిట్లనుంచి ఏకంగా 243 యూనిట్లకు చేరుకోవడం గమనార్హం. చెన్నైలో 113 యూనిట్ల నుంచి 219 యూనిట్లకు, హైదరాబాద్‌లో 141 యూనిట్ల నుంచి 219 యూనిట్లకు డిమాండ్ పెరిగింది. కానీ కోల్‌కతాలో 255 యూనిట్లనుంచి 83 యూనిట్లకు, పూణెలో 182 యూనిట్లనుంచి 155 యూనిట్లకు ఇళ్ల అమ్మకాలు పడిపోయాయి. ఇక నూతన హౌజింగ్ సరఫరా విషయానికి వస్తే ఎన్‌ఆర్‌ల్లో అధికంగా నమోదు కాగా, తర్వాతి స్థానాలను హైదరాబాద్, బెంగళూరు, ఎంఎంఆర్‌లు ఆక్రమించాయి. ఎన్‌సీఆర్‌లో మార్చి నెలతో పోలిస్తే, ఏప్రిల్‌లో కొత్త హౌజింగ్ స్టాక్ 59 శాతం పెరిగింది.