బిజినెస్

స్తబ్దుగా మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 14: దేశం మొత్తం మంగళవారం వెలువడబోయే కర్నాటక ఫలితాలపై దృష్టి కేంద్రీకరించడంతో, ఆ ప్రభావం సోమవారం దేశీయ మార్కెట్లపై పడింది. స్థూల ఆర్థిక డేటా కూడా నిస్తేజంగా ఉన్న ప్రభావం కూడా మార్కెట్లపై చూపింది. ఫలితంగా దేశీయ మార్కెట్లు సోమవారం స్తబ్దుగా ముగిసాయి. కర్నాటకలపై ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్, భాజపాల మధ్య నువ్వానేనా అన్న రీతిలో పోటీ వున్నట్లుగా చూపాయి. మరోపక్క స్థూల ఆర్థిక రంగానికి వస్తే, టోకుధరల ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో నాలుగునెలల గరిష్టానికి అంటే 3.18 స్థాయికి పెరిగింది. మార్చి నెలలో పారిశ్రామిక ఉత్పత్తి ఐదునెలల కనిష్టం 4.4 శాతానికి చేరుకోవడం మరో పరిణామం. ఈ పరిస్థితుల నేపథ్యంలో సోమవారం ఉదయం సెనె్సక్స్ 35,555.83 వద్ద లాభాల్లో ప్రారంభమైనప్పటికీ రోజంతా ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఒక దశలో 35,642.72 గరిష్టానికి చేరుకున్నా అమ్మకాల ఒత్తిళ్ల నేపథ్యంలో 20.92 పాయింట్ల లాభంతో 35,556.71 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా కేవలం 0.10 పాయింట్లు మాత్రమే పెరిగి 10,806 వద్ద ముగిసింది. సోమవారం నిఫ్టీ 10,834.85, 10.774.75 మధ్య ఊగిసలాడింది. ప్రాథమిక సమాచారం ప్రకారం శుక్రవారం దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.1,163.35 కోట్ల మేర కొనుగోళ్లు చేయగా, విదేశీ పోర్టుపోలియో మదుపర్లు రూ.325.44 కోట్ల మేర ఈక్విటీల అమ్మకాలు జరిపారు. ఏప్రిల్ నెలలో టోకు ధరల ద్రవ్యోల్బణం 3.18 శాతానికి చేరుకోవడానికి ప్రధాన కారణం, ఇంధనం, ఆహార ధరలు పెరగడమే. ఇది వినియోగదారుల ధరల సూచి (సీపీఐ)పై ప్రభావం చూపింది. ఇక ప్రభుత్వ రంగ సంస్థలు చమురు ధరలు పెంచడంతో, వాటి షేర్ ధరలు పెరిగాయి. పెట్రోల్ ధరలు లీటర్‌కు 0.17, డీజిల్ ధరలు లీటరుకు రూ.0.21 పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన క్రూడాయిల్ ధరాభారాన్ని, చమురు కంపెనీలు ప్రజలపైకి రుద్దడం వల్లనే ఈ ధరల పెరుగుదల చోటుచేసుకుంది.
ఇక బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఒఐఎల్‌ల షేర్ ధరలు పెరిగినా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ షేర్ ధరలు పడిపోవడం గమనార్హం. ఎన్‌టీపీసీ అధిక లాభాలను నమోదు చేయగా, డాక్టర్ రెడ్డీస్, ఇండస్‌లాండ్ బ్యాంక్, ఎస్‌బీఐ, హీరోమోటో కార్పొరేషన్, పవర్‌గ్రిడ్, ఇన్ఫోసిస్, ఆసియన్ పెయింట్స్, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, బజాజ్ ఆటో,హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, సన్‌ఫార్మా, కోటక్ మహేంద్రా లిమిటెడ్, ఐటీసీ, ఒన్‌జీసీల షేర్లు లాభాల్లో కొనసాగాయి.
ఎం అండ్ ఎం, టాటా మోటార్స్, ఎస్ బ్యాంకు, భారతీ ఎయిర్‌టెల్, ఆదాని పోర్ట్స్, టీసీఎస్, కోల్ ఇండియా, ఎల్ అండ్ టీ, ఐసీఐసీఐ బ్యాంకు, ఆర్‌ఐఎల్, మారుతి సుజికి, యాక్సిస్ బ్యాంకు నష్టాలు చవిచూశాయి..