బిజినెస్

ఒడిశా, చత్తీస్‌గఢ్‌లలో వంద మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, మే 15: సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్రంతోపాటు ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బొగ్గు ఉత్పత్తికి చర్యలు చేపట్టిందని ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ ఎన్ శ్రీ్ధర్ ప్రకటించారు. 100 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మంగళవారం హైద్రాబాద్‌లోని సింగరేణి భవన్‌లో గుర్తింపు కార్మిక సంఘం నాయకులతో స్ట్రక్చర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ కార్మికుల సంక్షేమం, సంస్థ అభివృద్ధి కోసం శ్రమిస్తుందన్నారు. చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో కొత్త బొగ్గు బ్లాకులు తీసుకుని బొగ్గు ఉత్పత్తిచేసే దిశగా పయనిస్తుందన్నారు. బొగ్గు ఉత్పత్తితోపాటు విద్యుత్ తయారీలో సైతం సింగరేణి సంస్థను అగ్రగామిగా నిలిపేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా కార్మికుల క్వార్టర్లకు ఏసీలను ఏర్పాటు చేసే పనులను వేగవంతం చేసామని తెలిపారు. కోల్ ఇండియా స్థాయిలో క్యాడర్ స్కీంను అమలు చేసేందుకు అధ్యయన కమిటీని వేశామని, నివేదిక వచ్చిన వెంటనే వారం రోజుల్లో చర్యలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో సింగరేణి కాలరీస్ డైరెక్టర్ (పా) పవిత్రన్‌కుమార్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, కార్మిక సంఘం నేతలు పాల్గొన్నారు.