బిజినెస్

సేవలను విస్తరించిన వినిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: ఆటోమేషన్ మొబైల్ సేల్స్ రంగంలో దూసుకుపోతున్న వినిట్ సంస్థ తన సేవలను విస్తృతపరిచింది. భారతదేశంతో పాటు మిడిల్ ఈస్ట్, సౌత్ ఏషియా దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థ ఆఫ్రికా దేశానికి విస్తరించింది. ఈ మేరకు ఆ దేశానికి చెందిన ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ ఒలామ్‌తో అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రసిడెంట్ సతీస్ కన్నన్ ఓ ప్రకటనలో తెలిపారు. దేశంలోని దిగ్గజ కంపెనీలైన పీ అండ్ జీ, బజాజ్ కార్ప్, పేపర్ బోట్, ఎన్‌ఎఫ్‌పీసీ, మిడ్ కామ్, లాటోమిల్క్ వంటి సంస్థలకు తాము అమ్మకాలలో తోడ్పాటును అందిస్తున్నామని చెప్పారు. సేల్ మోర్ అండ్ సెల్ బెట్టర్ అనే నినాదంతో నెలకొల్పిన సంస్థ అనతి కాలంలో దేశ, విదేశాల్లో కార్యకలాపాలు చేసే స్థాయికి ఎదడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు.