బిజినెస్

ఐటీఆర్-2 ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 15: ఆదాయం పన్ను శాఖ ఐటిఆర్-2ను మంగళవారం ప్రారంభించింది. 2018-19 సంవత్సరానికి మూడవ ఆదాయ రిటర్న్ దరఖాస్తు ఫారాన్ని ఆదాయం పన్ను శాఖ ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు, హిందూ అవిభక్త కుటుంబాలు తమ వ్యాపారం ద్వారా వచ్చే లాభాలపై కాకుండా ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయ వివరాలను ఐటిఆర్-2 ద్వారా తెలియచేయాల్సి ఉంటుంది. ప్రవాసభారతీయులు కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. దీంతో మూడు ఆదాయం పన్ను రిటర్న్స్‌ను ఆదాయం పన్ను శాఖ ప్రవేశపెట్టినట్లయింది. ఐటిఆర్-4ను మే 10వ తేదీన ప్రారంభించారు. దీనిని కూడా ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. మరో నాలుగు ఆదాయం పన్ను రిటర్న్స్‌ను ఆదాయం పన్ను శాఖ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఇప్పటికే వీటిని నోటిఫై చేసింది. సాలీనా రూ. 50 లక్షల వేతనం వరకు పొందే వేతన జీవుల కోసం ఐటిఆర్-1ను ప్రవేశపెట్టారు. ఇందులో డిపాజిట్లపైన, రికరింగ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ అంశాన్ని కూడా చేర్చారు. తమకు వచ్చే ఆదాయంపై కచ్చితమైన అంచనా ఉన్న ప్రొఫెషనల్స్, స్వయం ఉపాధి వ్యాపారం ద్వారా ఆదాయం పొందే వ్యక్తుల కోసం ఐటిఆర్-4ను ప్రవేశపెట్టారు. వీటి ఫారాలు వెబ్‌సైట్‌లో లభ్యమవుతాయి. పన్నుల ఆదాయంపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు విధానాన్ని ఖరారు చేస్తుంది. రిటర్న్స్ దాఖలు చేయడంలో ఎటువంటి మార్పులు లేవని, కొన్ని అంశాలను హేతుబద్ధీకరణ చేశామని బోర్డు అధికార వర్గాలు తెలిపాయి. కొన్ని వర్గాలను మినహాయించి, అన్ని రిటర్న్స్‌ను ఎలక్ట్రానిక్ విధానం ద్వారా దాఖలు చేయాలి. ఐటిఆర్-1 పరిధిలో మూడు కోట్ల మంది చెల్లింపుదారులు ఉన్నారు. వీరు జూలై 31వతేదీలోపు రిటర్న్స్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది.