బిజినెస్

భారీగా తరలివచ్చిన విదేశీ నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 15: భారత స్టాక్ మార్కెట్‌లో ఆశాజనకమైన పరిస్థితులు కనపడుతున్నాయి. ఈ ఏడాది మార్చి నెలలో విదేశీ ఇనె్వస్టర్లు స్టాక్ మార్కెట్లో 2.2 బిలియన్ డాలర్లను పెట్టుబడులు పెట్టారు. గత ఏడాది అక్టోబర్, డిసెంబర్ నెల త్రైమాసిక కాలంలో 2.6 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులను విదేశీ ఇనె్వస్టర్లు పెట్టారు. ఈ వివరాలను మార్నింగ్‌స్టార్ ఇనె్వస్ట్‌మెంట్ అడ్వైజర్ ఇండియా విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి నెలలో 2.16 బిలియన్ డాలర్లు, ఫిబ్రవరిలో 1.79 అమెరికా డాలర్లను మదుపు చేశారు. కాగా ఫిబ్రవరి నెలలో 1.77 బిలియన్ డాలర్ల వాటాలను విక్రయించారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు విదేశీ పెట్టుబడుల మొత్తం 442 బిలియన్ డాలర్లకు చేరింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ నుంచి డిసెంబర్‌తో పోల్చితే, జనవరి నుంచి మార్చి వరకు విదేశీ పెట్టుబడుల వృద్ధిరేటు నిలకడగానే 19 శాతం నమోదైంది. వృద్ధిరేటులో ఎటువంటి మార్పులు లేవు. విదేశీ పెట్టుబడుల వల్ల భారత్ మార్కెట్ కొత్త పుంతలు తొక్కుతోందని స్టాక్ మార్కెట్ నిపుణులు హిమాంశు శ్రీవాత్సవ చెప్పారు. పాజిటివ్ సెంటిమెంట్ మార్కెట్‌లో నెలకొని ఉందన్నారు. 2018-19లో భారత్ ఆర్ధిక రంగం వేగంగా అభివృద్ధి చెందే దేశంగా గుర్తింపు పొందుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఫిబ్రవరి నెలలో పెట్టిన పెట్టుబడులపై లాభాల దండుకునేందుకు విదేశీ ఇనె్వస్టర్లు వాటాలను విక్రయించారు. ఈ ఏడాది బడ్జెట్‌లో స్టాక్ మార్కెట్ ఆదాయంపై దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్ పన్నును విధించారు. ఈ భయంతోనే ఇనె్వస్టర్లు తమ వాటాలను తెగనమ్ముకున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాం బయటపడడం వల్ల బ్యాంకింగ్ రంగం మసకబారి సెంటిమెంట్‌ను దెబ్బకొట్టింది. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందన్న సమాచారం వల్ల భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే, అభివృద్ధి చెందిన దేశాల్లో పెట్టుబడులకు విదేశీ ఇనె్వస్టర్లు మొగ్గుచూపుతారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో రూపాయి విలువ క్షీణించడం వల్ల కూడా విదేశీ ఇనె్వస్టర్లు ఫిబ్రవరిలో వాటాలను అమ్ముకున్నారని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.