బిజినెస్

శ్రీసిటీలో బెల్జియం కాన్సుల్ జనరల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యవేడు/తడ, మే 15: చెన్నైలోని కింగ్‌డమ్ ఆఫ్ బెల్జియం కాన్సూల్ జనరల్ మార్క్ వాన్ డీ వ్రాకెన్ మంగళవారం చిత్తూరు,నెల్లూరు జిల్లాల సరిహద్దులో ఉన్న శ్రీసిటీని సందర్శించారు. బ్రెజిల్ వ్యాపార, పెట్టుబడుల కమిషనర్ జీన్ ప్రాంకోయిస్ ఆరనౌట్స్‌తో కలిసి శ్రీసిటీకి విచ్చేశారు. శ్రీసిటీ ప్రెసిడెంట్ రమేష్ సుబ్రహ్మణ్యం ఆయనకు సాదర స్వాగతం పలికి వౌలిక వసతులు, ప్రత్యేకతలు, పారిశ్రామిక ప్రగతిని వివరించారు. శ్రీసిటీలో వ్యాపారం చేయడానికి అనుకూలించే అంశాలను కూడా వారికి విశదీకరించారు. శ్రీసిటీ పరిసరాలను చుట్టిచూసిన అనంతరం మార్క్ వాన్ డీ వ్రాకెన్ మాట్లాడుతూ శ్రీసిటీ సందర్శన ఒక స్ఫూర్తిదాయక పర్యటనగా పేర్కొన్నారు. బెల్జియంకు చెందిన వెర్మీరియన్ సంస్థ ఇక్కడ ఉత్పత్తి చేస్తున్న అధునాతన చక్రాల కుర్చీలకు మంచి గిరాకీ సాధించిందని, అదేబాటలో మరిన్ని బెల్జియం కంపెనీలు శ్రీసిటీకి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీసిటీ మెగా పారిశ్రామిక వాడలోని వౌలిక వసతుల పరిశీలనతో పాటు పెట్టుబడుల అనుకూలతలను అధ్యయనం చేయడమే తమ పర్యటన ముఖ్య ఉద్దేశమని కాన్సూల్ జనరల్ బృందం తెలిపింది. శ్రీసిటీలోగల వెర్మీరియన్ డానియిలీ ఇండియా ఉత్పత్తి కేంద్రాలను సందర్శించారు. \\

చిత్రం..మంగళవారం ఏపీలోని శ్రీసిటీని సందర్శించిన బెల్జియం కాన్సూల్ జనరల్ బృందం