బిజినెస్

ఆరంభ లాభాలు ఆవిరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: కర్ణాటక ఎన్నికల ఫలితాలు దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయ. మంగళవారం ఉదయం ఎన్నికల ఫలితాలు వెలువడటం ప్రారంభమైన దగ్గరినుంచి మంచి జోరుమీద సాగిన మార్కెట్లు, భాజపాకు మెజారిటీ రాదన్న సంగతి స్పష్టమవడంతో ఒక్కసారిగా కుదేలయ్యాయి. అప్పటి వరకు ఆర్జించిన లాభాలు ఆవిరయ్యాయ. చివరకు బొంబాయ స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ క్రితం ముగింపుతో పోలిస్తే 13 పాయింట్ల దిగువన 35,543.94 పాయంట్ల వద్ద ముగిసింది.
దేశీయ పరిణామాలకు తోడు అంతర్జాతీయ పరిణామాలు పెద్దగా ఆశాజనకంగా లేకపోవడం కూడా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. ప్రారంభంలో ప్రభుత్వ రంగ సంస్థలు, వౌలిక వసతుల స్టాక్‌లు మంచి ఊపుమీద కొనసాగడంతో, మార్కెట్లు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. తర్వాత జేడీఎస్‌కు కాంగ్రెస్ మద్దతు ఇస్తున్న సంగతి స్పష్టమైన దగ్గరినుంచి సెనె్సక్స్, నిఫ్టీలు వేగంగా పతనం కావడం మొదలైంది. మొదట్లో భాజపా కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న విశ్వాసం మదుపర్లలో నిశ్చయం కావడంతో కొనుగోళ్లు విపరీతంగా సాగాయి. కాషాయ పార్టీ అవకాశాలు సన్నగిల్లుతున్న కొద్దీ, మార్కెట్లలో షేర్ల ధరలు పడిపోవడం ప్రారంభమయంది. దీనికి తోడు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పదహారు నెలల కనిష్టానికి అంటే రూ.67.92కు చేరుకోవడం మార్కెట్ల పతనానికి మరో కారణం. ఒక దశలో సెనె్సక్స్ 35,993.53 పాయంట్ల స్థాయికి ఎదిగి, మధ్యాహ్నానికి 35,497.92 పాయంట్ల కనిష్టానికి దిగజారింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 12.77 పాయింట్ల దిగువన 35,543.94 పాయంట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కూడా 10,929.20 పాయంట్ల గరిష్టానికి చేరుకొని తర్వాత ఒక దశలో 10,781.40 పాయంట్ల కనిష్ట స్థాయకి పడిపోయింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 4.75 పాయంట్ల (0.04 శాతం) దిగువన, 10,801.85 పాయంట్ల వద్ద ముగిసింది. ఇదిలా ఉండగా, సోమవారం విదేశీ పోర్టుపోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు) నికరంగా రూ.717.99 కోట్ల విలువయన షేర్లను, దేశీయ సంస్థాగత మదుపర్లు (డీఐఐలు) రూ.687.23 కోట్ల విలువయన వాటాలను కొనుగోలు చేశారు.