బిజినెస్

క్యూ4లో ఐటీసీ నికర లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* 9.86 శాతం వృద్ధిరేటు నమోదు
న్యూఢిల్లీ, మే 16: గత ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికం (క్యూ4)లో 9.86 శాతం వృద్ధిరేటుతో రూ.2932.71 కోట్ల నికర లాభాలను ఐటిసి సాధించింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలానికి రూ. 2667.47 కోట్ల నికర లాభాలను సాధించినట్లు ఐటిసి సంస్థ పేర్కొంది. ఐటి నికర అమ్మకాల వల్ల రూ.10705.75 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదేకాలానికి నికర అమ్మకాల వల్ల రూ.14,882.75 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది మార్చితో ముగిసిన సంవత్సరంలో జిఎస్‌టిని చూపించగా, గత ఏడాది వ్యాట్ ఉందని ఆ సంస్థ తెలిపింది. గత ఏడాది నాల్గవ త్రైమాసిక కాలంలో మొత్తం ఖర్చు రూ. 11,363.78 కోట్లు ఉండగా, ఈ ఏడాది మార్చి నెలతో ముగిసిన త్రైమాసికంలో ఖర్చు రూ. 6996.46 కోట్లని తేలిందన్నారు. కాగా సిఇవో హోదాను ఇకపై మేనేజింగ్ డైరెక్టర్‌గా మార్చారు. ఈ హోదాలో సంజీవ్ పురి ఉన్నారు. ఒక రూపాయి వాటాకు డివిడెండ్‌ను రూ.5.15ను ప్రకటించారు. ప్రస్తుతం ఐటిసి షేర్లు బిఎస్‌ఇ సూచీపై రూ. 285.10 పైసల వద్ద ట్రేడ్ అవుతున్నాయి.