బిజినెస్

చమురు ధరల పెంపుపై నిగ్రహం పాటించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 18: అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలను పెంచడంలో నిగ్రహం పాటిస్తూ స్థిరంగా ఉండేలా చూడాలని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఒపెక్ దేశాలకు నేతృత్వం వహిస్తున్న సౌదీ అరేబియాను కోరారు. ముడిచమురు ధరను పెంచడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ, వినియోగదార్లపై భారం పడుతుందని ఆయన పేర్కొన్నారు. బ్యారల్ ధర 80 అమెరికన్ డాలర్లకు చేరుకున్న నేపథ్యంలో ఆయన పైవిధంగా కోరడం గమనార్హం. రెండు దేశాల మధ్య పరస్పర సహకారం ముఖ్యంగా వర్తమాన చమురు మార్కెట్ పరిస్థితిపై ఆయన సౌదీ అరేబియా ఇంధన, పరిశ్రమలు, ఖనిజవనరుల శాఖ మంత్రి ఖలీద్ అల్-్ఫలీహ్‌తో గురువారం సాయంత్రం సమావేశమయ్యారని అధికారిక ప్రకటన తెలిపింది. 2014 నవంబర్ తర్వాత క్రూడాయిల్ ధర ఈ స్థాయిలో పెరగడం ఇదే ప్రథమం. అయితే ముడి చమురు ధరలు పెరగడానికి అనేక కారణాలున్నాయి. మూడో అతిపెద్ద చమురు ఎగుమతి దేశమైన ఇరాన్‌పై, అమెరికా ఆంక్షలు విధించడం, వెనిజులానుంచి సరఫరాలు తగ్గడం, ప్రపంచ దేశాల్లో మిగులు చమురు నిల్వలు లేకుండా చూసేందుకు వీలుగా ఒపెక్ దేశాలు ఉత్పత్తిని తగ్గించడం వంటివి చమురు ధరలు పెరగడానికి ప్రధాన కారణమని అంతర్జాతీయ ఇంధన సంస్థ పేర్కొంది.
ప్రదాన్ ఆందోళకు అల్-్ఫలీహ్ స్పందిస్తూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తగిన మద్దతివ్వడం సౌదీ అరేబియా లక్ష్యాల్లో ముఖ్యమైనదని స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం, డాలర్‌తో పోల్చినప్పుడు రూపాయి మారకం విలువ పడిపోవడం, దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడానికి కారణం. గత సోమవారం నుంచి పెట్రోల్ ధరలు లీటరుకు రూపాయి పెరగ్గా, డీజిల్ రూ.1.15 పెరిగింది. కాగా శుక్రవారం పెట్రోల్ ధర లీటరులు 29 పైసలు పెరిగింది. ఈవిధంగా రోజువారీగా ప్రెటోల్ ధరల మార్పులను గత జూన్ నుంచి అమలు పరుస్తున్నారు. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.75.61కి చేరింది. నగరంలో గతంలో ఎన్నడూ ఇంతటి గరిష్ట్ధర పలకలేదు. అదేవిధంగా డీజిల్ ధరలు కూడా లీటరుకు రూ.67.08కి చేరుకున్నది. గత ఏప్రిల్ 24 నుంచి, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారల్‌కు 5 డాలర్లు పెరిగితే, దేశీయ మార్కెట్‌లో లీటరుకు రూ.4 చొప్పున పెరిగే పరిస్థితి ఏర్పడింది. ఇందులో ఇప్పటికే 98 పైసలు పెంచారు. మిగిలిన వాటిని మరికొద్ది రోజుల్లో పెంచనున్నారు. అదేవిధంగా డీజిల్ ధర అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారల్‌కు 4.8 డాలర్ల చొప్పున పెరిగితే, దేశీయంగా రూ.3.5 నుంచి రూ.4.00 వరకు పెరుగుతుంది. ఇందులో ఇప్పటికే రూ.1.15 పెరిగింది కనుగ మిగిలిన మొత్తం త్వరలోనే పెరుగుతుంది.