బిజినెస్

ఉద్యోగాలు కోల్పోయిన వారికి చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 18: టెలికాం రం గంలో ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగులకు కేంద్రం సహాయం చేయడానికి ఉపక్రమించింది. వీరికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని ప్రభుత్వం సంకల్పించినట్టు టెలికాం కార్యదర్శి అరుణా సుం దర రాజన్ తెలిపారు. టెలికాం రంగంలో నెలకొన్న విపరీతమై పోటీ, రిలయన్స్ జీయో రం గంలోకి దిగిన తర్వాత ఇచ్చిన విపరీతమైన ఆఫర్ల నేపథ్యంలో, వివిధ టెలికాం సంస్థలు ఇ బ్బందుల్లో పడ్డాయి. ఫలితంగా 90 వేల మంది ఉపాధి కోల్పోయారు. ముందుగా ఈ రం గాన్ని సుస్థిరంగా ఉం చడం ప్రభుత్వ ప్రధా న లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పబ్లిక్ వై-ఫై, భారత్ నెట్ వంటి వాటిని ప్రవేశపెట్టనున్నామని ఆమె వెల్లడించారు. జియో ప్రవేశపెట్టిన రాయితీల ప్రభావంతో పాటు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ తన టెలిఫోనీ కార్యకలాపాలను నిలిపివేయడం వంటివాటివల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయారు.