బిజినెస్

ఎంపీఎస్ గ్రీనరీ డెవలపర్స్ ఆస్తుల వేలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 18: మదుపర్ల ధనాన్ని వసూలు చేసేందుకు వీలుగా, ఎంపీఎస్ గ్రీనరీ డెవలపర్స్ కు చెందిన 18 ఆస్తులను వేలం వేయాలని సెబీ నిర్ణయించింది. మొత్తం రూ.67 కోట్ల విలువైన వీ టికి వచ్చేనెల ఆన్‌లైన్‌లో వేలం నిర్వహిస్తుంది. గతేడాది జూన్‌లోవేలం వేసిన 14 ఆస్తులకు, గత ఫిబ్రవరిలో వేలం వేసిన 18 ఆస్తులకు ఇవి అద నం. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సెబీ ఈ ఆస్తుల వేలం ప్రక్రియ ప్రారంభించింది. ఎంపీఎస్ గ్రూపు ఆస్తులను లిక్విడిఫై చేయడం కోసం జస్టిస్ శైలేంద్ర ప్రసాద్ తాలూక్‌దార్‌లో ఏకసభ్య కమిషన్‌ను కోర్టు నియమించింది. ఈనేపథ్యం లో ఎంపీఎస్ ఆస్తులను వేలం వేయడానికి సెబీకి కమిషన్ అనుమతించింది. వీటిని ఈ-వేలం నిర్వహించేందుకు ఎస్‌బీఐ మూలధన మార్కెట్ సహకరిస్తుంది. ఎక్కడ ఉన్నది అక్కడనే అన్న ప్రాతిపదికపై ఈ వేలం జరుగుతుంది. ఈ సంస్థ చట్టవిరుద్ధమైన పథకాలను ప్రకటించి ప్రజలవద్ద నుం చి రూ.1520 కోట్ల మేర సేకరించింది. ఇదిలావుండగా ఈ 18 ఆస్తులను జూన్ 19న సెబీ వేలం వే స్తుంది. కనీస ధర రూ.67 కోట్లుగా నిర్ణయించింది. చట్టవిరుద్ధ పథకాలను నిలిపివేయాలని 2012, డిసెంబరులోనే సెబీ, ఎంపీఎస్ గ్రీనరీ డెవలపర్స్‌ను ఆదేశించింది. అందుకు సంస్థ విఫ లం కావడంతో చట్టబద్ధ చర్యలు ప్రారంభించింది.