బిజినెస్

సీసీఐ చీఫ్ పోస్టుకు అభ్యర్థి కావలెను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 19: వ్యాపారాల్లోని అక్రమాలను అరికట్టే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) చైర్‌పర్సన్ పోస్టుకు ఎవరిని నియమించాలా అని ప్రభుత్వం అభ్యర్థిని అనే్వషిస్తోంది. సిసిఐ చైర్మన్‌కు నెలకు 4.5 లక్షల రూపాయల కన్సాలిడేటెడ్ వేతనం ఇస్తారు. సిసిఐకు మూడో చైర్మన్‌గా 2016 జనవరి వరకు అశోక్ చావ్లా వ్యవహరించగా, తర్వాత ఈ పదవి చేపట్టిన సిక్రీ (65) పదవీ కాలం ఈ జూలైతో ముగుస్తుంది. దీంతో ఈ పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ కార్పొరేట్ వ్యవహారాల శాఖ ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులు జూలై రెండో తేదీకల్లా తమ దరఖాస్తులను పంపించాలని కోరింది. ఇటీవల కాలంలో సిసిఐకు ప్రాధాన్యత బాగా పెరిగింది. వివిధ వ్యాపారాల్లో సాగుతున్న అక్రమాలపై ఇది కనే్నస్తోంది. ముఖ్యంగా రియల్‌ఎస్టేట్, ఆటోమోటివ్, బొగ్గు, విమానయానం, బ్యాంకింగ్ వంటి రంగాల్లో జరిగే వ్యవహారాలను ఇది పరిశీలిస్తోంది.