బిజినెస్

ఆధార్ అనుసంధానానికి 87 శాతం గ్రామీణుల అంగీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 19: ప్రభుత్వ పథకాలు, ఇతర సేవల నిమిత్తం ఆధార్‌కార్డును తప్పనిసరిగా అనుసంధానం చేయడానికి 87 శాతం గ్రామీణ ప్రజలు అంగీకరించారని ఒక సర్వే తెలియజేసింది. ఇనె్వస్ట్‌మెంట్ సంస్థ ఒమిడియార్ నెట్‌వర్కు ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలోని గ్రామీణ ప్రాంతాల్లో జరిపిన సర్వేలో పలు విషయా లు వెల్లడయ్యాయి. 77 శాతం గ్రామీణులు తమ ఆధార్‌ను ప్రైవేట్ సంస్థల సేవలకు లింక్ చేయడానికి సైతం అంగీకరించారు. ఆధార్‌ను లింక్ చేయడానికి వారు ఈ సందర్భంగా పలు కారణాలు తెలియజేశారు. ఈ అనుసంధానంతో పనులు త్వరగా పూర్తవుతాయని అభిప్రాయపడ్డారు. వీరిలో 66.9 శాతం తమ ఆధార్‌ను బ్యాంక్ ఖాతాలు వంటివి తెరవడానికి ఐడెంటిఫికేషన్ ప్రూఫ్‌కింద వాడగా, 17.2 శాతం మంది ఖాతాలు తెరవడానికి కెవైసి (నో యువర్ కస్టమర్) కింద వినియోగిస్తున్నారు. 15.9 శాతం మాత్రం ఆధార్‌కార్డును ఎలాంటి పనులకు ఉపయోగించడం లేదు. కాగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పౌరసరఫరాల వ్యవస్థలో ఆహారపదార్థాలు, ఇతర వస్తువుల పంపిణీలో ఆధార్ వినియోగం పెరిగింది. 2016-17లో ఇది 72 శాతం ఉండగా, 2017- 18 సంవత్సరానికి 82 శాతానికి పెరిగింది. అయితే ఓటర్ కార్డుతో పోల్చిచూస్తే ఆధార్‌కార్డుల్లో తప్పులశాతం ఎక్కువగా ఉంది. ఓటర్ ఐడి కార్డుల్లో తప్పుల శాతం 5.7 శాతం మాత్రమే ఉండగా, ఆధార్ కార్డు ల్లో 8.8 శాతం ఉన్నట్టు ఆ సర్వే నివేదికలో పేర్కొంది.