బిజినెస్

మ్యూచ్‌వల్ ఫండ్స్‌పై హెచ్‌డీఎఫ్‌సీ రుణాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 25: దేశంలోనే తొలిసారిగా మ్యూచ్‌వల్ ఫండ్స్‌పై డిజిటల్ రుణాల మంజూరు ప్రక్రియను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు చేపట్టింది. ట్రాన్స్‌ఫర్ ఏజెంట్ సీఎఎంఎస్ భాగస్వామ్యంతో శుక్రవారం నుంచి రుణాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు గత ఏడాది లోన్స్ ఎగెనెస్ట్ సెక్యూరిటీస్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా లోన్స్ ఎగెనెస్ట్ మ్యూచ్‌వల్ ఫండ్స్ ప్రక్రియను పూర్తిగా ఆటోమేటిక్ డిజిటల్ ప్రక్రియగా తీసుకువచ్చింది. సాధారణంగా మ్యూచ్‌వల్ ఫండ్స్‌పై రుణాలు తీసుకోవాలంటే ఐదారు రోజుల సమయం పడుతుంది. మ్యూచ్‌వల్ ఫండ్స్‌ను నగదుగా మార్చుకోవాలంటే కొన్ని రోజుల సమయం తప్పదు. కాని డిజిటల్ ఎల్‌ఎఎంఎఫ్‌తో మ్యూచ్‌వల్ ఫండ్‌పై రుణం పొందవచ్చు. వినియోగదారులు తాకట్టుపెట్టే మ్యూచ్‌వల్ ఫండ్స్, ఓవర్‌డ్రాఫ్ట్ కాలపరిమితిని లెక్కగట్టి కరెంట్ ఎకౌంట్‌ను ఆన్‌లైన్‌లో ప్రారంభించి కొన్ని నిముషాల్లోనే నగదును జమ చేస్తారు. ఈ విధానంలో కొన్ని నిముషాల్లోనే ఖాతాలోకి నగదు జమ అవుతుంది. ఈక్విటీ ఫండ్స్‌పైనా రుణం పొందవచ్చు. నగదుగా మార్చకుండానే మ్యూచ్‌వల్ ఫండ్స్‌ను ఉంచుకోవచ్చు. ఇప్పటివరకూ రుణం తీసుకోని వినియోగదారులకు అవకాశం ఉంది. వాడుకున్న నగదుకు మాత్రమే వడ్డీ చెల్లించే వీలుంది. దేశవ్యాప్తంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వెబ్‌సైట్లలో రుణం లభిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ అన్‌సెక్యూర్డ్ లోన్, హోమ్స్, మార్టిగేజ్ లోన్స్ గ్రూప్ హెడ్ అరవింద్ కపిల్ మాట్లాడుతూ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా డిజిటల్ రుణం ఉపయోగపడుతుందని, మార్కెట్ స్థితికి అనుగుణంగా వినియోగదారులు తమ సంపదను నగదుగా మార్చుకోవాల్సిన అవసరం ఉండదని, అదే విధంగా క్యామ్స్‌తో తమ భాగస్వామ్యం ఎంతో ఆనందంగా ఉందన్నారు.