బిజినెస్

మళ్లీ బలపడిన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 31: మదుపరులు విస్తృతంగా కొనుగోళ్లకు పూనుకోవడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం బలపడ్డాయి. రెండు రోజుల నష్టాలకు తెరదించుతూ గురువారం మార్కెట్ కీలక సూచీలు బాగా పుంజుకున్నాయి. మే నెల డెరివేటివ్‌ల కాంట్రాక్టుల గడువు గురువారంతో ముగియడంతో పాటు వెలువడనున్న దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గణాంకాల పట్ల మదుపరుల ఆశావాద దృక్పథానికి తోడు ప్రపంచ స్టాక్ మార్కెట్లలో నెలకొన్న సానుకూల ధోరణి దేశీయ స్టాక్ మార్కెట్ కీలక సూచీలు పుంజుకోవడానికి దోహదపడింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 416.27 పాయింట్లు పుంజుకొని, రెండు వారాల గరిష్ఠ స్థాయి అయిన 35,322.38 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 121.80 పాయింట్లు పెరిగి, కీలకమయిన 10,700 పాయింట్ల స్థాయికి పైన 10,736.15 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇటలీలో రాజకీయ ప్రతిష్టంభనపై నెలకొన్న ఆందోళనలు కొంతవరకు తగ్గడంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లలో సానుకూల ధోరణి నెలకొంది. దీంతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లలో మదుపరుల సెంటిమెంట్‌ను బలోపేతం చేసింది. సెనె్సక్స్ గురువారం ఉదయం సానుకూల స్థాయి 35,083.81 పాయింట్ల వద్ద ప్రారంభమయి, మదుపరుల నుంచి అందిన కొనుగోళ్ల మద్దతుతో మరింత ముందుకు సాగుతూ ఇంట్రా-డేలో 35,416.03 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 416.27 పాయింట్ల (1.19 శాతం) పైన 35,322.38 పాయింట్ల వద్ద ముగిసింది. ఏప్రిల్ 5న 577.73 పాయింట్లు పెరిగిన ఈ సూచీ, ఆ తరువాత ఇంత భారీగా పెరగడం ఇదే మొదటిసారి. ఈ సూచీ క్రితం రెండు సెషన్లలో కలిసి 259.37 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ గురువారం క్రితం ముగింపుతో పోలిస్తే 121.80 పాయింట్లు (1.15 శాతం) ఎగువన 10,736.15 పాయింట్ల వద్ద స్థిరపడింది. అంతకు ముందు ఈ సూచీ 10,763.80- 10,620.40 పాయింట్ల మధ్య కదలాడింది.