బిజినెస్

3 మిలియన్ టన్నుల చక్కెర నిల్వలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 31: చెరకు రైతులకు మిల్లర్లు బకాయి ఉన్న రూ.22వేల కోట్లను క్లియర్‌ చేసేందుకు వీలుగా మూడు మిలియన్ టన్నుల చక్కెర నిల్వలను ఏర్పాటు చేయనున్నట్లు ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ తెలిపారు. 2017-18లో రికార్డు స్థాయిలో 31.6 మిలియన్ టన్నుల చెరకు ఉత్పత్తి జరిగిందన్నారు. దీని వల్ల చక్కెర ధరలు తగ్గి చక్కెర మిల్లుల ఆర్థిక పరిస్థితి దెబ్బతిందన్నారు. అన్నిశాఖలు, నిపుణుల అభిప్రాయాలను సేకరించి మూడుమిలియన్ టన్నుల చక్కెర నిల్వలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ అంశంపై ఒక ము సాయిదా విధానపత్రాన్ని రూపొందించి వివిధ శాఖలకు పరిశీలన నిమిత్తం పంపామన్నారు. చక్కెర మార్కెట్‌లో సంక్షోభం నెలకొందని, దీనిని పరిష్కరించాలంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కేంద్రానికి లేఖ రాశారు. బఫర్ స్టాక్‌లను కల్పించడంతో పాటు చక్కెరపై మిల్లు నిర్ణయించే ధరకు అదనంగా ధరను నిర్ణయించాలని ముసాయిదా విధానపత్రంలో ప్రతిపాదించారు. చక్కెర ఎగుమతులకు సంబంధించి కూడా మిల్లర్లు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారన్నారు. ఇథనాల్ రంగాన్ని ఆదుకునేందుకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ కూడా అనేక మార్గాలను ఆనే్వషిస్తున్నట్లు మంత్రి చెప్పరు. ప్రస్తుతం చక్కెర కేజీ రూ.25.60 పైసల నుంచి రూ. 26.22 పైసల మధ్య ఉందన్నారు. క్వింటాల్ చక్కెరపై రూ.5.5 సబ్సిడీ ఇచ్చే ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. చక్కెర దిగుమతి సుంకాన్ని రెట్టింపుచేశారు. సాలీనా భారత్‌లో 25 మిలియన్ టన్నుల చక్కెరకు డిమాండ్ ఉంది.