బిజినెస్

పునరాలోచనలో కేంద్రం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 31: ఎయిర్ ఇండియాలో మెజార్టీ వాటాలను విక్రయించాలన్న అంశంపై కేంద్రం పునరాలోచనలో పడింది. ఈ సంస్ధ వాటాలను విక్రయించేందుకు గురువారంతో గడువు ముగిసింది. ఈ వాటాలను కొనుగోలు చేసేందుకు ఒక్క బిడ్‌ను కూడా సంస్థలు దాఖలు చేయలేదు. ఈ సంస్థ వాటాలను కొనుగోలు చే సేందుకు బిడ్డర్లు ఎవరూ ముందుకు రావడంలేదని, తమను సంప్రదించడం లేదని విమానయాన మం త్రిత్వ శాఖ కార్యదర్శి ఆర్‌ఎన్ చౌదరి చెప్పారు. ఇకపై గడువును పొడిగించే అవకాశం లేదని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఈ సంస్ధలో వాటాలను విక్రయించేందుకు నిర్దేశించిన విధి విధానాల్లో మార్పులు తేవాల్సిన అవసరం ఉందని ఏవియేషన్ విశే్లషకులంటున్నారు. ఒక్కబిడ్ కూడా దాఖలుకాకపోవడం పట్ల ప్రభుత్వానికి నిరాశ కలిగించిందని ముంబాయికి చెందిన విమానయాన రంగ విశే్లషకులు పే ర్కొన్నారు. ఎయిర్ ఇండియాలో 78 శాతం మేర వాటాలను విక్రయిస్తామని ఈ ఏడాది మార్చి 28వ తేదీన కేంద్రం ప్రకటించింది. ఇండియాకు చెందిన టాటా గ్రూప్, సింగపూర్ ఎ యిర్‌లైన్స్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్‌లు కన్సార్టియంగా ఏర్పడి ఎయిర్ ఇండియాను కొనుగోలు చేస్తారనే ప్రచారం జరిగింది. కాని ఈ సంస్ధలు ఈ ప్రతిపాదనలు ఏవీలేవన్నారు. 1932లో నెలకొల్పిన ఎయిర్ ఇండియా భారత పౌర విమానయా న రంగాన్ని శాసించింది. ఎయిర్ ఇం డియాను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అనేక ప్రభుత్వాలు పెద్ద ఎత్తున నిధులను వెచ్చించాయి. నరేంద్రమోదీ ప్రభుత్వం ఎయిర్ ఇండియావాటాలను విక్రయించాలని చివరకు నిర్ణయించింది. ఎయిర్ ఇండియా రూ.5800 కోట్లనష్టాల్లో ఉంది.