బిజినెస్

పెరిగిన విద్యుత్ వాడకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 1: విద్యుత్ వాడకం అనూహ్యంగా పెరుగుతోంది. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరగడం, ఏసీల వినియోగం తారాస్థాయికి చేరడం, పరిశ్రమలకు కోతల్లేని సరఫరాను అందివ్వడంతో విద్యుత్ వాడకం విపరీతంగా ఉంటోంది. ఆంధ్రప్రదేశ్ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఏపీఈపీడీసీఎల్) పరిధిలోకి వచ్చే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి దాదాపు 60 లక్షల విద్యుత్ సర్వీసులుండగా, మొత్తం మీద రోజూ 67 మిలియన్ యూనిట్ల మేర వాడకం జరుగుతోంది. ఉష్ణోగ్రతల తీవ్రత ఇలాగే ఉంటే 70 ఎంయూ కు చేరుకుంటుందని సంస్థ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ అవసరమైన విద్యుత్‌ను అందుబాటులోకి ఉంచుతున్నామన్నారు. వాస్తవానికి మే 30న 3300 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా, 3500 మెగావాట్ల విద్యుత్‌ను సంస్థ అందుబాటులోకి తీసుకురాగలిగింది. ఈ ఏడాది వేసవి ఆరంభంలో రోజూ 55 నుంచి 60 మిలియన్ యూనిట్ల వాడకం జరిగేది. మార్చి నెలంతా ఇంచుమించు ఇదే వాడకం కొనసాగేది. ఎండల తీవ్రత, ఉక్కపోతతో కొన్నాళ్ళపాటు 60మిలియన్ యూనిట్లకు పెరిగింది. ఆ తరువాత మధ్యలో వర్షాలతో వాతావరణం కాస్త చల్లబడటంతో వాడకం తగ్గింది. అయితే గత వారం రోజులుగా ఏపీలో పలుచోట్ల పెరిగిన ఉష్ణోగ్రతలతో 60నుంచి 65 మిలియన్ యూనిట్లకు చేరుకుంది.