బిజినెస్

రూ.4,700 కోట్ల ‘స్టెర్లింగ్’ ఆస్తుల జప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 1: స్టెర్లింగ్ బయోటెక్ గ్రూపునకు చెందిన రూ.4,700 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. గుజరాత్‌కు చెందిన ఈ సంస్థ రూ.5వేల కోట్ల మేర బ్యాంకు కుంభకోణానికి పాల్పడిందన్న అరోపణల నేపథ్యంలో ఈడీ ఈ చర్య తీసుకుంది. ఈ సంస్థపై గత అక్టోబర్‌లో కేసు నమోదు చేసిన ఈడీ, ఇప్పుడు ఆస్తులను జప్తు చేసింది. ఈ ఏడాది నీరవ్ మోదీ, మెహుల్ ఛోస్కీ బ్యాంకు స్కాం తర్వాత ఇంతపెద్ద మొత్తంలో జప్తు చేయడం ఈ ఏడాది ఇదే ప్రథమం. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈ చర్య తీసుకున్నట్టు ఈడీ వెల్లడించింది. సంస్థకు చెందిన విదేశీ లావాదేవీలపై కూడా విచారణ కొనసాగిస్తున్నామని, ఇందుకోసం ఆయా దేశాల న్యాయవ్యవస్థల వద్దకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. నైజీరియాలో సంస్థ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన చమురు క్షేత్రా లు, ఆయిల్ రిగ్గులను, విదేశాల్లోని 50 బ్యాంకుల్లో ఖాతాలను జప్తు చేయడానికి యత్నిస్తున్నామని పేర్కొంది. ఈ ఏడాది మొదట్లో నీర వ్ మోదీ ఆయన బంధువు మెహుల్ చోస్కీలకు చెందిన రూ.7,600 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిన సంగతి తెలిసిందే. కాగా స్టెర్లింగ్ గ్రూపు, ఆచూకీ లేకుండా పోయిన కంపెనీ ప్రమోటర్లు నితిన్, చేతన్ సందెసరాలపై గత అక్టోబర్‌లో ఈడీ కేసులు నమోదు చేసింది.