బిజినెస్

విజయ్ మాల్యాపై మరో మూడేళ్ల నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 1: యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్‌కు సంబంధించిన నిధుల అక్రమ తరలింపు కేసులో విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యాను సెక్యూరిటీస్ మార్కెట్లనుంచి మరో మూడేళ్ల పాటు సెబీ నిషేధించింది. ఇదే సమయంలో లిస్టెడ్ కంపెనీల జాబితాలో డైరెక్టర్‌గా మరో ఐదేళ్లపాటు నిషేధించింది. దీంతో పాటు ఇద్దరు మాజీ కంపెనీ డైరెక్టర్లయిన అశోక్ కపూర్, పి.ఎ. మురళిలపై రెండేళ్ల పాటు నిషేధం విధించింది. ఈ ఆదేశాల ప్రకారం వీరిద్దరూ మరే ఇతర కంపెనీలో ఏడాది పాటు డైరెక్టర్లుగా పనిచేయడానికి వీలుండదు. అక్రమంగా నిధుల తరలింపు కేసులో విజయ్ మాల్యాతో పాటు మరో ఆరుగురు అధికార్లను ఆరు నెలల పాటు నిషేధిస్తూ 2017, జనవరిలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మళ్లించిన నిధులపై కంపెనీ తప్పుడు లెక్కలను సమర్పించిందని సెబీ పేర్కొంది. ఈనేపథ్యంలో తగిన చర్య తీసుకోవాల్సి పరిస్థితి ఏర్పడిందని సెబీ పూర్తికాల సభ్యుడు జి. మహాలింగం అన్నారు.