బిజినెస్

రెండేళ్లు గడువివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 1: నష్టాల నుంచి రెండేళ్లలో తేరుకుంటామని, ఈ మేరకు గడువు ఇవ్వాలని కోరుతూ తొమ్మిది ప్రభుత్వ రంగ సంస్ధలు కేంద్రానికి ఒక కార్యాచరణ ప్రణాళికతో కూడిన నివేదిక ఇచ్చాయి. ఈ బ్యాంకుల ఆర్థిక పరిస్థితిని ప్రస్తుతం ఆర్‌బిఐ నిశితంగా పరిశీలిస్తోంది. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల పరిధిలో ఉన్న బ్యాంకుల ఆర్థిక పరిస్థితి బాగాలేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ గత నెలలో పేర్కొన్న విషయం విదితమే. ఈ బ్యాంకులు లోపాలను సరిదిద్దుకుని, బకాయిలను రికవరీ చేసుకుని ఆర్థికంగా కుదుటపడేందుకు సంబంధించి ఒక ప్రణాళికను రూపొందించి ఆర్‌బిఐను సంప్రదించాలని ఆయన కోరారు. ఇందులో తొమ్మిది బ్యాంకులు ఒక ప్రణాళికను తయారు చేసి డిపార్టుమెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసస్‌కు నివేదిక ఇచ్చాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేనా బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పోరేషన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకు, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నివేదికలను సమర్పించాయి. ఈ బ్యాంకులు నష్టాల నుండి బయటపడి దిద్దుబాటు చర్యలను తీసుకోవాల్సి ఉంటుంది. వ్యయ నియంత్రణ, బ్యాంకు బ్రాంచిలను తగ్గించడం, విదేశీ బ్రాంచిలను మూసివేయడం, కార్పోరేట్ రుణాలను విరివిగా ఇచ్చే పద్ధతికి స్వస్తి చెప్పడం, రిస్క్‌ను ఎదుర్కొంటున్న ఆస్తులను విక్రయించడం లాంటి విధానాలను అమలు చేస్తామని బ్యాంకులు నివేదికలో పేర్కొన్నాయి. కాంగ్రెస్ హయాంలో బ్యాంకులు ఎడాపెడా రుణాలు ఇచ్చాయని, దీని వల్ల బ్యాంకులు సంక్షోభంలో ఉన్నాయని ఇటీవల ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. బ్యాంకుల ఆర్థికంగా ఒక గాడిన పడేందుకు కేంద్రం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన శుక్రవారం చెప్పరు. బ్యాంకులు ఆర్థికంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొనేందుకు కారణం గత ప్రభుత్వ విధానాలే కారణమని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో బ్యాంకులను ఆదుకునేందుకు రూ.2.11 లక్షల కోట్లతో కేంద్రం ఒక విధానాన్ని ప్రకటించింది.