బిజినెస్

బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ జూన్ 1 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్ప త్తిలో సింగరేణి అత్యధిక రికార్డు సృష్టించిందని సింగరేణి సంస్థ సిఎండి శ్రీ్ధర్ వెల్లడించారు. దీంతో 11.6 శాతం బొగ్గు రవాణాలో కూడా లక్ష్యాలను సాధించామని ఆయన అన్నారు. గత ఏడాది మే నెలలో సింగరేణి సంస్థ 52,4 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగా, అదే ఈ ఏడాది 58.4 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేశామని చెప్పారు. సింగరేణితో బొగ్గు సరఫరా ఒప్పందం మేరకు విద్యుత్ సంస్థలకు వేసవిలో విద్యుత్ ఉత్పాదనకు తగినంత బొగ్గును సరఫనా చేశామని చెప్పా రు. గత ఏడాది మే నెలలో 31.29 మిలియన్ల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్‌ను తొలిగించిన కంపెనీ ఈ ఏడాది 37,63 మిలియన్ల క్యూబిక్ మీటర్ల ఓబిని తొలిగించి రికార్డు స్థాయిలో 20,3 శాతం వృద్ధిని సాధించిందని అన్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్‌లో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం మే నెలలో 90.33 శాతం పిఎల్‌ఎఫ్ సాధించి 806.49 మిలియన్ల యూని ట్లు విద్యుత్ ఉత్పత్తి చేసిందన్నారు. విద్యుత్ వాడకం గరిష్ట స్థాయిలో ఉన్న ఈ వేసవి నెలలో సింగరేణి 762.37 మిలియన్ల యూనిట్లు విద్యుత్‌ను గజ్వెల్ గ్రిడ్‌కు సరఫరా చేశామన్నారు. యూనిట్ 2లో మే నెలలో 93.7 శాతం పిఎల్‌ఎఫ్‌తో 418 మిలియన్ల యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేయగా 86. శాతం పిఎల్‌ఎఫ్‌తో యూనిట్ 1 ఈ నెలలో 388.23 మిలియన్ల యూనిట్లు విద్యుత్‌ను ఉత్పత్తి చేసిందని చెప్పారు. థర్మల్ విద్యుత్ యూనిట్ ప్రారంభం నుంచి మే నెల వరకూ 15.350.33 మిలియన్ల యూనిట్లు విద్యుత్‌ను ఉత్పత్తి చేయ గా. 14.391.7 మిలియన్ల యూనిట్లు విద్యుత్‌ను రాష్ట్ర అవసరాల కోసం అందించామన్నారు. బొగ్గు ఉత్పత్తి తో పాటు విద్యుదుత్పత్తిని ఘననీయంగా పెంచినందుకు అధికారుల తో పాటు కార్మికులను సంస్థ సిఎండి శ్రీ్ధర్ అభినందించారు.