బిజినెస్

మళ్లీ వాణిజ్య యుద్ధ భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 1: దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు ఒకవైపు సానుకూలంగా ఉన్నప్పటికీ, అమెరికా నిర్ణయాలతో తలెత్తిన వాణిజ్య వివాదాలు ప్రపంచ వాణిజ్య యుద్ధానికి దారి తీస్తాయేమోనన్న తాజా భయాందోళనల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్పంగా నష్టపోయాయి. మదుపరులు ముఖ్యంగా పవర్, బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణకు పూనుకోగా, మే నెలలో వాహనాల అమ్మకాల గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉండటం వల్ల వాహన రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అమెరికా తాజాగా కీలక మిత్ర దేశాలయిన యూరోపియన్ యూనియన్, కెనడా, మెక్సికో సహా పలు దేశాల నుంచి దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియంలపై కూడా దిగుమతి సుంకాలను విధించడంతో ఆయా దేశాలు ప్రతీకార చర్యలకు దిగుతాయేమోనన్న భయాందోళనలు నెలకొన్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేం జ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ శుక్రవారం క్రితం ముగింపుతో పోలిస్తే 95.12 పాయింట్ల దిగువన 35,227.26 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 39.95 పాయింట్ల దిగువన 10,696.20 పాయింట్ల వద్ద స్థిరపడింది. 2018 జనవరి- మార్చి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు ఏడు త్రైమాసికాల గరిష్ఠ స్థాయి 7.7 శాతంగా నమోదయిందని గురువారం మార్కెట్ పనివేళలు ముగిసిన తరువాత వెలువడిన గణాంకాల ఊతంతో శుక్రవారం మార్కెట్ కీలక సూచీలు అధిక స్థాయిల వద్ద ప్రారంభమయ్యాయి. సెనె్సక్స్ 35,373.98 పాయింట్ల వద్ద ప్రారంభమయి, ఇంట్రా-డేలో 35,438.22 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 95.12 పాయింట్ల (0.27 శాతం) దిగువన 35,227.26 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 39.95 పాయింట్లు (0.37 శాతం) పడిపోయి, 10,681.50 పాయింట్ల వద్ద స్థిరపడింది. అయి తే, ఈ రెండు సూచీలు కూడా వారం రీత్యా చూస్తే ఈ వారంలో పుంజుకున్నాయి. సెనె్సక్స్ ఈ వారంలో 302.39 పాయింట్లు (0.87 శాతం) పుంజుకోగా, నిఫ్టీ 91.05 (0.86 శాతం) పెరిగింది. ఇదిలా ఉండగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) గురువారం నాటి లావాదేవీలలో నికరంగా రూ. 15.31 కోట్ల విలువయిన షేర్లను విక్రయించగా, దేశీయ సం స్థాగత మదుపరులు (డీఐఐలు) రూ. 266.02 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేశారు. శుక్రవారం నాటి లావాదేవీలలో టాటా స్టీల్ అత్యధికంగా 2.62 శాతం, ఓఎన్‌జీసీ 2.48 శాతం చొప్పున నష్టపోయాయి. నష్టపోయిన ఇతర సంస్థలలో ఎంఅండ్‌ఎం, హెచ్‌యూఎల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, పవర్ గ్రిడ్, అదాని పోర్ట్స్, కోటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఆసియన్ పెయింట్స్, ఎస్‌బీఐ, టీసీఎస్, ఐటీసీ లిమిటెడ్, విప్రో ఉన్నాయి. మే నెల లో వాహనాల అమ్మకాల గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో షేర్ల ధరలు శుక్రవారం పెరిగాయి. బజాజ్ ఆటో, మారుతి సుజుకి, హీరో మోటోకార్ప్, టాటా మోటార్స్ షేర్ల ధర 5.13 శాతం వరకు పెరిగింది.