బిజినెస్

దూసుకుపోతున్న జీఎస్‌టీ వసూళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: వస్తు సేవా పన్ను (జిఎస్‌టి) వసూళ్లు మే నెలలో రూ.94,016.16 కోట్లు వసూలైనట్లు కేంద్రం ప్రకటించింది. ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో రూ. 1.03 లక్షల కోట్ల జిఎస్‌టి వసూలైంది. ఏప్రిల్ నెలపైన తగ్గినా, మొత్తం పైన పన్ను వసూళ్ల తీరు సంతృప్తికరంగా ఉందని ఆర్థిక శాఖ కార్యదర్శి హష్ముక్ ఆదియా పేర్కొన్నారు. మే నెలలో 62.47 లక్షల మంది, ఏప్రిల్ నెలలో 60.47 లక్షల మంది రిటర్న్స్ దాఖలు చేశారు. 2017-18 సంవత్సరంలో సగటున ప్రతి నెల రూ.89,885 కోట్ల మేర జిఎస్‌టి వసూలైంది. దీంతో పోల్చితే మే నెలలో ఎక్కువగా జిఎస్‌టి వసూలైందని కేంద్రం పేర్కొంది. జిఎస్‌టి వసూళ్లు బాగున్నాయని ఆయన ట్వీట్ చేశారు. సరకుల రవాణాకు సంబంధించి ఇ వే బిల్స్ విధానాన్ని ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభించారు. రూ.50వేలు అంతకంటే ఎక్కువ విలువ ఉన్న సరకులను రవాణా చేసే రవాణాదారులు జిఎస్‌టి ఇనెస్పెక్టరకు ఇ-వే బిల్స్‌ను సమర్పించాలి. మే నెలలో వసూలైన రూ.94,016 కోట్లలో సిజిఎస్‌టి రూ. 15,866 కోట్లని, ఎస్‌జిఎస్‌టి రూ.21,691 కోట్లని, ఐజిఎస్‌టి రూ. 49,120 కోట్లని, సెస్ రూ. 7339 కోట్లని కేంద్రం తెలిపింది. మార్చినెలకు సంబంధించి రాష్ట్రాలకు జిఎస్‌టి నష్టపరిహారం నిమిత్తం రూ.6696 కోట్లను విడుదల చేశారు. 2017-18లో గత ఏడాది జూలై నుంచి మార్చి వరకు రూ. 47,844 కోట్లనను విడుదల చేశారు. ఇ-వే బిల్స్ విధానాన్ని కూడా అమలు చేయడం వల్ల దేశ వ్యాప్తంగా జిఎస్‌టి వసూళ్లు వచ్చే రెండు నెలల్లో ఇంకా పెరుగుతాయని పిడబ్ల్యుసి సంస్థ ప్రతినిధి ప్రతిక్ జైన్ తెలిపారు. మే నెలలో వసూలైన జిఎస్‌టికి సంబంధించి జిఎస్‌టి నష్టపరిహారం నిధులను జూన్ నెలలో రాష్ట్రాలకు విడుదల చేస్తారు. డెలాయిట్ ఇండియా సీనియర్ డైరెక్టర్ అతుల్ గుప్తా మాట్లాడుతూ ఈ ఏడాది జనవరి-మార్చి నెలల్లో ఆర్థిక రంగం ఉరకలు వేసిందని చెప్పారు. జిఎస్‌టి వసూళ్లలో ఎదురైన చికాకులు తొలుగుతున్నాయన్నారు.