బిజినెస్

ఆక్వా సంక్షోభం తాత్కాలికమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూన్ 2: ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రంగ సంక్షోభం తాత్కాలికమేనని నెల్లూరుకు చెందిన బీఎంఆర్ సంస్థ ఛైర్మన్ బీ మస్తాన్‌రావు పేర్కొన్నారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సంక్షోభంలో ఉన్న ఆక్వా రంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో సహాయ సహకారాలు అందించి ఆదుకుంటున్నారన్నారు. రూ.6.90 ఉన్న యూనిట్ విద్యుత్ ధరను రూ.2కి తగ్గించడంవల్ల రైతుకు నష్టాలు గణనీయంగా తగ్గుతాయన్నారు. ‘తక్కువ ఖర్చుతో ఆక్వా సాగు’ అంశంపై ఆక్వా ప్రొఫెషన్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఏపీడబ్ల్యూఏ) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శనివారం రాత్రి నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఏపీడబ్ల్యూఏ అధ్యక్షుడు ఎ.శ్రీనివాసరావుఅధ్యక్షతన జరిగిన ఈ సదస్సును ఆనంద గ్రూప్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాధరాజు జ్యోతిప్రజ్వళన చేసి ప్రారంభించారు. రాష్ట్రంలో ఉన్న ఆక్వా రైతులు, డీలర్లు, హేచరీ యజమానులు, మత్య్సశాఖ అధికారుల సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మస్తాన్‌రావు మాట్లాడుతూ విద్యుత్ యూనిట్ ధర రూ.2కు తగ్గిన నేపధ్యంలో ప్రతీ కిలో రొయ్యలపైన రైతుకు కనీసం రూ.30 నుంచి రూ.40 వరకు మిగులుతుందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తమ సంస్ధ ఫీడ్ ధరను రూ.10 తగ్గించిందని, అలాగే రొయ్య కొనుగోలు ధర రూ.20 వరకు పెంచామని వివరించారు. చైనాలో రొయ్యల వినియోగం 16 లక్షల మెట్రిక్ టన్నులు పెరిగిందని, ధాయ్‌లాండ్, వియత్నాం, మలేషియా తదితర దేశాలతో కలిపి ప్రపంచవ్యాప్తంగా మిలియన్ టన్నుల రొయ్యలకు డిమాండ్ పెరిగిందన్నారు. యూరోపియన్ యూనియన్ మంచి ధర ఇస్తోందని తెలిపారు. ఈ ఏడాది అమెరికా వంటి దేశాల్లో గతం కంటే ఎక్కువగా చలి తీవ్రత రోజులు పెరగడంవల్ల అక్కడ హోటల్స్ తెరవక ధర సమస్య తలెత్తిందన్నారు. గత రెండు రోజుల నుంచి ధరలు పెరుగుతున్నాయన్నారు. ఆనంద గ్రూప్ చైర్మన్ యుకె.విశ్వనాధరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 24 గంటలు ఆక్వాకు విద్యుత్ అందించడంతోపాటు యూనిట్ ధర.2కు తగ్గించడం ఆక్వా రైతుకు వరమన్నారు. జనరేటర్ మీద యూనిట్‌కు రూ.24 ఖర్చవుతోందని, ఆక్వా రంగం అంతా విద్యుత్ పైనే ఆధారపడి ఉన్నందున సీఎం నిర్ణయం రైతులకు వరమవుతుందన్నారు. ఆక్వా రంగ సంస్థల ప్రతినిధులకు ఆక్వా ఫ్రొఫెషన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున బీఎంఆర్, ఆనంద గ్రూప్ చైర్మన్ విశ్వనాధరాజు అవార్డులను అందించారు. ఎపీడబ్య్లూఎ జనరల్ సెక్రటరీ రాయప్రో లు శ్రీనివాసరావు, కోశాధికారి రాజారామం పాల్గొన్నారు.