బిజినెస్

అనిశ్చితిలోనూ బలపడిన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 2: అనిశ్చితి నెలకొన్నప్పటికీ ఈ వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభపడ్డాయి. శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 302.39 పాయింట్లు పుంజుకొని 35,227.26 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 91.05 పాయింట్లు పెరిగి 10,696.20 పాయింట్ల వద్ద స్థిరపడింది. ప్రతికూల ప్రపంచ పరిణామాల వల్ల అనిశ్చితి నెలకొన్నప్పటికీ, ముడి చమురు ధరలు తగ్గడం, డాలర్‌తో పోలిస్తే 16 నెలల కనిష్ట స్థాయికి దిగజారి ఉన్న రూపాయి తిరిగి పుంజుకోవడం వంటి సానుకూల అంశాల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ కీలక సూచీలు ఈ వారంలో పైకి ఎగబాకగలిగాయి. ఇటలీలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి కారణంగా ప్రపంచ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీనికి తోడు దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాను మూడీస్ 7.5 శాతం నుంచి 7.3 శాతానికి తగ్గించడం ప్రతికూలంగా పరిణమించింది. అయితే, మే నెల డెరివేటివ్ కాంట్రాక్టుల కాలపరిమితి గురువారంతో ముగియనున్న తరుణంలో మదుపరులు ఎడతెగకుండా షార్ట్ కవరింగ్‌లకు పూనుకోవడంతో పాటు దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ఏడు త్రైమాసికాల గరిష్ఠ స్థాయికి పెరిగి, ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అనే ట్యాగ్‌ను తిరిగి పొందడం వల్ల మదుపరులలో ఆశావాద దృక్పథం నెలకొనడంతో కీలక సూచీలు తిరిగి పుంజుకోగలిగాయి. దేశ తయారీ (మాన్యుఫాక్చరింగ్) రంగం కార్యకలాపాలు అంతకు ముందు నెలతో పోలిస్తే మేలో మందగించడంతో పాటు ఐరోపాకు చెందిన కీలకమయిన మిత్ర దేశాలు, మెక్సికో సహా పలు దేశాల నుంచి దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా తాజాగా విధించిన దిగుమతి సుంకాలతో ప్రపంచ వాణిజ్య యుద్ధం సంభవిస్తుందేమోననే ఆందోళనలు మళ్లీ నెలకొనడం దేశీయ స్టాక్ మార్కెట్లపై ఈ వారంలో ప్రతికూల ప్రభావం చూపింది. ఏప్రిల్‌లో 51.6 ఉన్న నిక్కెయి మాన్యుఫాక్చరింగ్ పీఎంఐ మేలో 51.2కు తగ్గింది.
సెనె్సక్స్ ఈ వారంలో 35,074.32 పాయింట్ల అధిక స్థాయి వద్ద ప్రారంభమయి, 35,438.22 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 34,735.11 పాయింట్ల కనిష్ట స్థాయి మధ్య కదలాడింది. చివరకు క్రితం వారంతో పోలిస్తే 302.39 పాయింట్ల (0.87 శాతం) పైన 35,227.26 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ క్రితం వారంలో స్వల్పంగా 76.57 పాయింట్లు పుంజుకుంది. నిఫ్టీ ఈ వారంలో 10,648.35 పాయింట్ల అధిక స్థాయి వద్ద ప్రారంభమయి, 10,764.75, 10,558.45 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు క్రితం వారం ముగింపుతో పోలిస్తే 91.05 పాయింట్ల (0.86 శాతం) పైన 10,696.20 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇదిలా ఉండగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు), విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్‌ఐఐలు) ఈ వారంలో నికరంగా రూ. 912.23 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు.