బిజినెస్

స్టీల్‌ప్లాంట్‌కు స్టార్ పెర్‌ఫార్మర్ అవార్డ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 2: రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్)కు చెందిన విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ఎగుమతుల విభాగంలో స్టార్ పెర్‌ఫార్మర్ అవార్డును దక్కించుకుంది. ఢిల్లీలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖల సహాయ మంత్రి సీఆర్ చౌదరి చేతుల మీదుగా విశాఖ ఉక్కు మార్కెటింగ్ జీఎం ఎస్‌కే చక్రబర్తి అందుకున్నారు. కేంద్ర వాణిజ్య, పారిశ్రామిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ ఎక్స్‌పోర్ట్స్ పెర్‌ఫార్మెన్స్ కౌన్సిల్ (ఈఈపీసీ) 2016- 17 సంవత్సరానికి గాను స్టార్ పెర్‌ఫార్మర్ అవార్డుకు విశాఖ ఉక్కును ఎంపి క చేసింది. గత రెండేళ్లుగా విశాఖ ఉక్కు ఈ ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును అందుకుంటుండగా, గత నాలుగేళ్లుగా స్టార్ పెర్‌ఫార్మర్ రీజనల్ అవార్డును దక్కించుకుంటోంది. ఆర్‌ఐఎన్‌ఎల్ ఉక్కు ఎగుమతుల్లో గణనీయమైన ప్రగతి కనబరుస్తోంది. గతేడాది 5.25 లక్షల టన్నుల ఉక్కు ను ఇతర దేశాలకు ఎగుమతి చేయ డం ద్వారా రూ.1,725 కోట్ల టర్నోవర్‌కు చేరుకుంది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే రూ.678 కోట్లు అధికం. విశాఖ ఉక్కు ఉత్పత్తులు యుఎస్‌ఏ, కెన్యా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, శ్రీలంక, నేపాల తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రతిష్టాత్మక స్టార్ పెర్‌ఫార్మర్ అవార్డును అందుకున్న ఉక్కు మార్కెటింగ్ జీఎం చక్రబర్తి, ఇతర విభాగ అధికారులను ఇన్‌ఛార్జి సీఎం డీ రాయ్ చౌదరి అభినందించారు.

చిత్రం..ప్రతిష్టాత్మక ఎక్స్‌పోర్ట్ ఎక్స్‌లెన్స్ అవార్డును అందుకున్న జీఎం మార్కెటింగ్
చక్రబర్తిని అభినందిస్తున్న ఇన్‌చార్జ్ సీఎండీ రాయ్ చౌదరి