బిజినెస్

తరుముకొస్తున్న అమెరికా ఆంక్షలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 2: తమకు అత్యవసరంగా జూన్ నెలవసరాలకు అదనంగా ఒక మిలియన్ బారెల్స్ ముడి చమురును సమకూర్చాలని భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్) నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీని కోరింది. అమెరికా ఏ క్షణమైనా ఆంక్షలు విధిస్తుందన్న సమాచారం నేపథ్యంలో బిపిసిఎల్ సంస్థ ముందు జాగ్రత్తగా ముడి చమురుకు ఆర్డర్ ఇచ్చింది. ఇరాన్ పెట్రోలియం రంగంపై ఆంక్షలు విధిస్తామని అమెరికా ఇప్పటికే హెచ్చరించింది. దీంతో ఇరాన్ చమురు ఎగుమతిదార్లపై తీవ్ర ప్రభావం పడింది. ఇరాన్‌తో కుదుర్చుకున్న 2015 నాటి న్యూక్లియార్ ఒప్పందాన్ని కూడా రద్దు చేసినట్లు ఇటీవల ట్రంప్ ప్రకటించారు. ఆంక్షలు ఏ సమయం నుంచైనా అమెరికా విధించే అవకాశం ఉండడంతో బీపీసిఎల్ మేల్కొని ముడి చమురుకు ఆర్డర్ ఇచ్చిందని చమురు కంపెనీ వర్గాలు తెలిపాయి. భారత్‌కు 2018-19లో ముడి చమురును షిప్పింగ్ చార్జీలు లేకుండా సరఫరా చేస్తామని ఇరాన్ గతంలో హామీ ఇచ్చింది. ఇరాన్ నుంచి చమురును చైనా తర్వాత కొనుగోలు చేసే రెండవ అతి పెద్ద దిగుమతి దేశం భారత్. గతంలో పాశ్చాత్య దేశాలు ఇరాన్‌పై ఆంక్షలు విధించిన సమయంలోకూడా టెహరాన్‌తో వాణిజ్య సంబంధాలను కొనసాగించింది. మన దేశం ఐక్యరాజ్యసమితి విధించే ఆంక్షలను మాత్రమే పాటిస్తుంది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో మనదేశంలో చమురు దిగుమతి సంస్థలు, పేమెంట్ మెకానిజంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడలేదు. కాగా అత పెద్ద రిఫైనరీ కాంప్లెక్స్ ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీ సంస్థ అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ నుంచి చమురు దిగుమతులను నిలుపుచేయాలని యోచిస్తున్నట్లు చమురు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ నిర్ణయం ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ నుంచి అమలు చేయాలని రిలయన్స్ వర్గాలు తెలిపాయి. కాగా కేంద్ర ఆర్థిక, పెట్రోలియం, విదేశాంగ మంత్రిత్వశాఖకు చెందిన అధికారుల బృందం వచ్చే సోమవారం నుంచి ఐరోపా దేశాల్లో పర్యటించనున్నాయి. అమెరికా ఆంక్షలు విధించినా, ఇరాన్‌తో వాణిజ్యం కొనసాగించాలనే నిర్ణయంతో ప్రభుత్వం ఉన్నట్లు ఈ వర్గాలు తెలిపాయి. ఐరోపాదేశాలు ఇరాన్‌ను 2015 అణు ఒప్పందం నుంచి రక్షించి ఆర్ధికంగా ప్యాకేజీ ఇవ్వాలనే యోచనతో ఉన్నాయి.