బిజినెస్

విమానాల తయారీ ప్లాంట్‌లను భారత్‌లో ఏర్పాటు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశంలో విమానయాన రంగం అభివృద్ధి చేసేందుకు వీలుగా భారత్‌లో విమానాలను తయారు చేసే సంస్థను నెలకొల్పాల ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు విమానాల తయారీ సంస్థ ఎయిర్ బస్‌ను కోరారు. మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టును విజయవంతం చేసేందుకు చేయూత ఇవ్వాలని ఆయన కోరారు. మంత్రి సురేష్ ప్రభు శుక్రవారం ఫ్రాన్స్‌లో టౌలౌజ్‌లో ఎయిర్ బస్ విమానాల నిర్మాణాల సంస్థను సందర్శించారు. ఎయి ర్ బస్ భారత్‌లో ప్లాంట్‌ను నిర్మిస్తే ఉద్యోగాల కల్పన పెరుగుతుందని, ప్రాంతీయంగా విమానాశ్రయాల మధ్య అనుసంధానం వృద్ధి చెందుతుందన్నార. అంతర్జాతీయం గా విమానయాన రంగంలో భారత్‌కు మంచి గుర్తింపు వస్తుందన్నారు. మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు భారత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రస్తు తం భారత్ గగన తలంలో ఎయిర్ బస్ తయారు చేసిన 300 విమానాలు తిరుగుతున్నాయి. మరో 530 విమానాల తయారీకి ఆర్డర్లు వచ్చా యి. ఎయిర్ బస్ ఉన్నతాధికారులను కూడా కలుస్తానని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లో జరిగిన వింగ్స్ ఇండియా ఏవియేషన్ కార్యక్రమానికి ఎయిర్ బస్ కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ ఇండియా అధ్యక్షుడు శ్రీనివాసన్ ద్వారకానాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారానికో ఒక విమానం భారత్‌కు తమ సంస్థ ఒక విమానాన్ని సమకూరుస్తోందన్నారు. వచ్చే 20 ఏళ్లలో భారత్ ఏవియేషన్ రంగానికి కొత్తగా 1750 విమానాలు అవసరమ ని అంచనా. వీటి విలువ 25 బిలియ న్ డాలర్లు. టౌలౌజ్‌లో ఎయిర్ బస్ ప్లాంట్‌ను సందర్శించడమే కాకుండా, ప్రయాణీకుల విమానాల తయారీ, అందులో సదుపాయాలు, టెక్నాలజీని మంత్రి సురేష్ ప్రభు చూశారని, సాంకేతిక వివరాలు అడిగి తెలుసుకున్నారని ఇండియన్ ఎంబసీ ట్వీట్ చేసింది.

చిత్రం..పౌరవిమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు