బిజినెస్

ఎపిలో ఇతిహాద్ ఎయిర్‌వేస్ సర్వీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 27: విశాఖ, విజయవాడ, తిరుపతిల్లోని ప్రధాన విమానాశ్రయాల నుంచి వివిధ దేశాలకు నేరుగా విమాన సర్వీసులు నడిపేందుకు ప్రముఖ విదేశీ విమానయాన సంస్థ ఇతిహాద్ ముందుకొచ్చింది. చైనా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండోరోజు సోమవారం కూడా బిజీబిజీగా గడిపారు. టియాంజిన్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో చంద్రబాబు పాల్గొని పలువురు పారిశ్రామికవేత్తలను కలుసుకున్నారు. ఇందులో భాగంగా ఇతిహాద్ విమానయాన సంస్థ ఉపాధ్యక్షుడు విజయ్ పూనోసామితో ముఖాముఖి భేటీ అయ్యారు. విజయవాడ, విశాఖ, తిరుపతి నుంచి నేరుగా విదేశాలకు వెళ్లే సదుపాయం కల్పించడానికి తమ సంస్థ సంసిద్ధంగా ఉందని సామి ఈ సందర్భంగా బాబుకు తెలిపారు. ఇందుకోసం పౌర విమానయాన శాఖ అనుమతులు కోరుతామని ఆయన చంద్రబాబుకు చెప్పారు.
ఆక్సియోనా పునరుత్పాదక విద్యుత్ కేంద్రం
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక విద్యుదు త్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి స్పెయిన్‌కు చెందిన ఆక్సియోనా ఎనర్జీ సంస్థ ముందుకొచ్చింది. ఆక్సియోనా ఎనర్జీ కంపెనీ టెక్నలాజికల్ హెడ్ జాక్విన్ ఎనిన్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు. ఎలిన్ మాట్లాడుతూ తమ కంపెనీ ఎపిలో 200 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పనున్నట్టు తెలిపారు. వచ్చే ఏడాది జూన్ నాటికి విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో 100 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని, 2018-19లో మరో 100 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రపంచంలోనే తొలి భారీ సౌర విద్యుత్ కేంద్రంగా ప్రాచుర్యం పొందిన నెవడా సోలార్ వన్ నిర్మాణంలో ఆక్సియోనా ఎనర్జీ కీలక పాత్ర పోషించింది. 2007 తరువాత ఆక్సియోనా ఎనర్జీ కంపెనీ 164 దేశాల్లో 4,500 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన 164 పవన విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
విద్యుత్ రంగానికి ‘టోటల్’ చేయూత
ఇక ఆంధ్రప్రదేశ్ ఇంధన రంగాన్ని అత్యంత అధునాతనంగా తీర్చిదిద్దేందుకు సహకారం అందిస్తామని టోటల్ ఎస్‌ఎ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ జీరోమ్ స్మిట్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హామీ ఇచ్చారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొచ్చి విద్యుత్ వినియోగాన్ని తగ్గించడంలో తమ సంస్థ తోడ్పడుతుందన్నారు. ఇదిలావుండగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో డాన్ఫోస్ గ్రూప్ చైర్మన్ జోర్జన్ మాడ్స్ క్లాసన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఆహారశుద్ధి కర్మాగారాలు, మెగా కోల్డ్ చెయిన్ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేయడానికి ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. డాన్ఫోస్ గ్రూప్ ఆహార శీతలీకరణ, ఎయిర్ కండిషనింగ్, హీట్ బిల్డింగ్స్, ఎలక్ట్రిక్ మోటార్లు, కంప్రెషర్లు, డ్రైవ్స్, పవర్ మొబైల్ యంత్రాల రంగాల్లో ప్రసిద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్‌తో భాగస్వామిగా పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించాలని చంద్రబాబు నాయుడు జోర్జన్ మాడ్స్ క్లాసన్‌ను కోరారు.
ఇదిలావుంటే, మోడ్రన్ ఎలక్ట్రన్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సిఇఒ టోనీపాన్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఐటి రంగాన్ని వినియోగించుకుంటున్న తీరును టోనీపాన్ అభినందించారు. యువ పారిశ్రామికవేత్తలతో తమ రాష్ట్రానికి రావాలని టోనీపాన్‌ను చంద్రబాబు ఆహ్వానించారు. చైనా ప్రభుత్వ ఎస్సెట్స్ సూపర్‌విజన్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కమిషన్ ప్రతినిధులతోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డుతో వ్యాపార భాగస్వామిగా రాష్ట్భ్రావృద్ధికి తోడ్పడాలని కమిషన్ ప్రతినిధులను ఆయన కోరారు. టియాంజిన్ పారిశ్రామికవేత్తలతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్తలకు సుహృద్భావ సంబంధాలు ఏర్పడేందుకు ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు ఎంఓయు కుదుర్చుకోవాలని సూచించారు. పెట్టుబడి అవకాశాలపై అధ్యయనం చేసేందుకు టియాంజిన్ పారిశ్రామికవేత్తల బృందం తమ రాష్ట్రంలో పర్యటించాలని చంద్రబాబు కోరారు. ఈ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పరకాల ప్రభాకర్, ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు సిఇఒ కృష్ణకిశోర్, డెవలప్‌మెంట్ కమిషనర్, ఎక్స్‌అఫిషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ పివి రమేష్, ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు.